పెద్ద అవుటపల్లి, పున్నమి ప్రతినిధి సురేష్
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి పుణ్యక్షేత్రంలో బ్రదర్ జోసెఫ్ తంబి 81వ వర్ధంతి మహోత్సవాల గోడ పత్రికను గుడి పెద్దలు, సంఘ పెద్దలు మరియు మీడియా మిత్రుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనవరి 13, 14, 15 తేదీల్లో జరగనున్న ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
దేశవ్యాప్తంగా తరలిరానున్న ఈ మహోత్సవాలకు కర్ణాటక, కేరళ, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు.
అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పుణ్యక్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడు సంతోషంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమ విజయవంతానికి సహకరిస్తున్న పోలీస్, వైద్య, ఫైర్, ఎలక్ట్రికల్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులకు మరియు సిబ్బందికి కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
బ్రదర్ జోసెఫ్ తంబి ఈ గ్రామంలోనే నివసించి, ఇక్కడే సమాధి అయ్యారని, ఆయన సమాధి చెంత ప్రార్థనలు చేయడం వల్ల ఎంతోమంది భక్తులకు అద్భుతాలు జరిగాయని గ్రామస్తులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పుణ్యక్షేత్ర బాధ్యులు, గ్రామ పెద్దలు వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాబోయే మూడు రోజుల ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. మీ అందరికీ కూడా ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాము.


