పెందుర్తి నియోజకవర్గం మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్,
విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: పెందుర్తి తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం జరిగిందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం జీవీఎంసీ 96 వ వార్డు పెందుర్తి మహిళా ప్రగతి కేంద్రం సమావేశ మందిరంలో అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, ఆంధ్ర ప్రదేశ్ ఆయిల్ సీడ్స్ చైర్మన్ గండి బాబ్జి లతో కలిసి బాధితులకు నిత్యవసర సరుకులను అందించారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మొoథా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలకు ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు అందించడం జరిగిందని తెలిపారు.
పెందుర్తి నియోజవర్గం జీవీఎంసీ 96 వ వార్డు ఏకలవ్య కాలనీ తుఫాన్ ప్రభావంతో పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు అత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం మరియు తక్షణ ఆర్థిక సహాయం కింద ఒక మనిషికి ₹1000 గరిష్టంగా కుటుంబానికి మూడు వేల రూపాయల నగదును పంపిణీ చేసామన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి వెంకట అప్పారావు, జీవీఎంసీ 8వ జోనల్ కమిషనర్ శంకరరావు, అనకాపల్లి జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వర రావు ,జీవీఎంసీ వార్డు కార్పొరేటర్లు రాపర్తి కన్నా , బల్ల శ్రీనివాసరావు , సేనాపతి శంకర్రావు,ముమ్మన దేవుడు , నియోజవర్గం బిజెపి పార్టీ ఇంచార్జ్ గొర్లి రాము నాయుడు ,పెందుర్తి పిఎసిఎస్ చైర్మన్ ఐతి సింహాచలం, ఏపీ ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మడక పార్వతి , ఏఎంసి వైస్ చైర్మన్ గోరపిల్లి సోము నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ ఆర్ఎస్ నాయుడు, ఉరిటి గోవింద్, సంతోష్, ముమ్మన సతీష్, గొంతిన హైమవతి, ఎంపీటీసీ గొల్లవిల్లి రమణ, మండల పార్టీ అధ్యక్షులు కొరుపోలు రాము నాయుడు, వార్డు అధ్యక్షులు డిబిఎల్ నాయుడు, కంచిపాటి మధు, పిన్నింటి పార్వతి మొదలగు పెందుర్తి మండలం ఉమ్మడి ఎన్ డి ఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


