పీఏసీఎస్ చైర్మన్ పై ఆశ..!
వెల్దండ : రాష్టంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు నామినేటెడ్ విధానంలో పాలక మండళ్లను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.
వెల్దండ : రాష్టంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు నామినేటెడ్ విధానంలో పాలక మండళ్లను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వెల్డండ మండల కాంగ్రెస్ నాయకుడు పీఏసీఎస్ చైర్మన్ పదవీ పై ఆశలు పెట్టుకున్నట్టు సొంత పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. సహకార పరపతి సంఘాలకు ఇకపై ఎన్నికలు ఉండవని, నామినేటెడ్ పద్దతిలో పాలక మండలాలను వచ్చే సంవత్సరం జనవరి లో ప్రకటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు వెల్డండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు యెన్నం శ్రీనివాస్ రెడ్డి చైర్మన్ పదవీ కోసం ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి తో మంతనాలు కొనసాగిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకే చైర్మన్ పదవీ దక్కుతుందని భారీగా ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.


