Friday, 13 February 2026
  • Home  
  • * పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కాంగ్రెస్ శీతకన్ను –పాలమూరు బిడ్డ”నని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు –కేసీఆర్‌ను విమర్శించడమే కాదు, ముందు మిగిలిన పనులు పూర్తి చేయాలి. —సబితా ఇంద్రారెడ్డి మరియు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక సమావేశం..
- రంగారెడ్డి

* పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కాంగ్రెస్ శీతకన్ను –పాలమూరు బిడ్డ”నని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు –కేసీఆర్‌ను విమర్శించడమే కాదు, ముందు మిగిలిన పనులు పూర్తి చేయాలి. —సబితా ఇంద్రారెడ్డి మరియు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక సమావేశం..

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 24:మహేశ్వరం నియోజకవర్గంలోని జిహెచ్ఎంసి మీర్పేట్ సామ యాదిరెడ్డి గార్డెన్ లో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశంపై ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై తొలిసారిగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించాం.పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ చెప్పిన వాస్తవాలను పక్కన పెట్టి కాంగ్రెస్ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.90 శాతం పనులు పూర్తయినా మిగిలిన 10 శాతం పనులను ఎందుకు పూర్తి చేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పాలమూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను వేసి, కనీసం చర్చ కూడా చేయలేదు. “పాలమూరు బిడ్డ”నని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు.తెలంగాణ రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం రెండు అతిపెద్ద ప్రాజెక్టులు ప్రారంభించింది — కాళేశ్వరం, పాలమూరు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసుల కారణంగా ఆలస్యం జరిగింది, లేకుంటే ఎప్పుడో పూర్తయ్యేది.అన్ని కేసులు కొట్టివేసిన తర్వాత 30 వేల కోట్ల రూపాయలతో కేసీఆర్ పాలమూరు పనులకు శంకుస్థాపన చేశారు 27 వేల కోట్లతో రిజర్వాయర్ల పనులు పూర్తయ్యాయి. ఇంకా రెండు కిలోమీటర్ల కాలువ తవ్వితే నీళ్లు వస్తాయని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.పాలమూరు ప్రాజెక్టు పూర్తైతే 7 నియోజకవర్గాలకు సాగునీరు అందేలా ప్రణాళిక రూపొందించాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రూపాయి కూడా కేటాయించలేదు, తట్ట మట్టి కూడా తీయలేదు.45 టీఎంసీలు సరిపోతాయని మంత్రి ఉత్తమ్ ఎందుకు లేఖ రాశారో ప్రజలకు చెప్పాలి.గత 10 ఏళ్లలో కేసీఆర్ రైతులకు ఉచిత కరెంట్, ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ద్వారా సాగునీరు అందించారు. కేసీఆర్‌ను విమర్శించడమే కాదు, ముందుగా మిగిలిన పనులు పూర్తి చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా కూలిపోవాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. సీఎం తన సొంత నియోజకవర్గానికి మాత్రమే నీళ్లు తీసుకెళ్లాలని చూస్తున్నారా? మిగతా నియోజకవర్గాలకు నీళ్లు అవసరం లేదా అని ఘాటుగా స్పందించారు. ఇట్టి అంశంపై కెసిఆర్ అధ్యక్షతన మా కార్యచరణ కొనసాగుతుందని తెలిపారు.ఈ సమావేశంలోరంగారెడ్డి జిల్లా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ , మహేష్ రెడ్డి , మెతుకు ఆనంద్ , పైలెట్ రోహిత్ రెడ్డి , ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి , సీనియర్ నాయకులు క్యామ మల్లేష్ , రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 24:మహేశ్వరం నియోజకవర్గంలోని జిహెచ్ఎంసి మీర్పేట్ సామ యాదిరెడ్డి గార్డెన్ లో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశంపై ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై తొలిసారిగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించాం.పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ చెప్పిన వాస్తవాలను పక్కన పెట్టి కాంగ్రెస్ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.90 శాతం పనులు పూర్తయినా మిగిలిన 10 శాతం పనులను ఎందుకు పూర్తి చేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పాలమూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను వేసి, కనీసం చర్చ కూడా చేయలేదు. “పాలమూరు బిడ్డ”నని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు.తెలంగాణ రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం రెండు అతిపెద్ద ప్రాజెక్టులు ప్రారంభించింది — కాళేశ్వరం, పాలమూరు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసుల కారణంగా ఆలస్యం జరిగింది, లేకుంటే ఎప్పుడో పూర్తయ్యేది.అన్ని కేసులు కొట్టివేసిన తర్వాత 30 వేల కోట్ల రూపాయలతో కేసీఆర్ పాలమూరు పనులకు శంకుస్థాపన చేశారు 27 వేల కోట్లతో రిజర్వాయర్ల పనులు పూర్తయ్యాయి. ఇంకా రెండు కిలోమీటర్ల కాలువ తవ్వితే నీళ్లు వస్తాయని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.పాలమూరు ప్రాజెక్టు పూర్తైతే 7 నియోజకవర్గాలకు సాగునీరు అందేలా ప్రణాళిక రూపొందించాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రూపాయి కూడా కేటాయించలేదు, తట్ట మట్టి కూడా తీయలేదు.45 టీఎంసీలు సరిపోతాయని మంత్రి ఉత్తమ్ ఎందుకు లేఖ రాశారో ప్రజలకు చెప్పాలి.గత 10 ఏళ్లలో కేసీఆర్ రైతులకు ఉచిత కరెంట్, ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ద్వారా సాగునీరు అందించారు. కేసీఆర్‌ను విమర్శించడమే కాదు, ముందుగా మిగిలిన పనులు పూర్తి చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా కూలిపోవాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. సీఎం తన సొంత నియోజకవర్గానికి మాత్రమే నీళ్లు తీసుకెళ్లాలని చూస్తున్నారా? మిగతా నియోజకవర్గాలకు నీళ్లు అవసరం లేదా అని ఘాటుగా స్పందించారు. ఇట్టి అంశంపై కెసిఆర్ అధ్యక్షతన మా కార్యచరణ కొనసాగుతుందని తెలిపారు.ఈ సమావేశంలోరంగారెడ్డి జిల్లా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ , మహేష్ రెడ్డి , మెతుకు ఆనంద్ , పైలెట్ రోహిత్ రెడ్డి , ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి , సీనియర్ నాయకులు క్యామ మల్లేష్ , రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.