Friday, 13 March 2026
  • Home  
  • పదవ తరగతి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు- భరత్ రెడ్డి
- తిరుపతి

పదవ తరగతి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు- భరత్ రెడ్డి

పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టపడి చదివి, ఉన్నత ఫలితాలతో పాఠశాలకు, తాము పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావాలని కలవగుంట భరత్ రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం మండల పరిధిలోని బోనుపల్లి, లింగమనాయుడుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు కలవగుంట భరత్ రెడ్డి యువసేన సభ్యుల ద్వారా ఉచితంగా పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చరవాణి ద్వారా భరత్ రెడ్డి విద్యార్థులతో మాట్లాడుతూ.…విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పదో తరగతి తొలిమెట్టు వంటిదని, ఏకాగ్రతతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు చిన్న ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఈ సామాగ్రిని అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులందరికీ ‘ఆల్ ది బెస్ట్’ చెబుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, యువసేన సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.