(పున్నమి ప్రతినిధి)
నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన వైద్య చికిత్స విజయవంతంగా నిర్వహించారు. కావలి పట్టణానికి చెందిన 37 ఏళ్ల నాగరాజు నోటిలో నుంచి తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రికి రావడంతో వైద్యులు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళంలో రంధ్రం ఏర్పడినట్లు గుర్తించారు. మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన బ్రాంకిల్ ఆట్రీ ఎంబోలైజేషన్ విధానంతో చికిత్స చేసి రక్తస్రావాన్ని పూర్తిగా నియంత్రించారు. ఈ చికిత్స నెల్లూరులో తొలిసారిగా నిర్వహించామని డాక్టర్ భక్తవత్సల రెడ్డి, డాక్టర్ శ్రావణి రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు వెల్లడించారు.


