Thursday, 5 February 2026
  • Home  
  • నూతన ఆంగ్ల సంవత్సరాన్ని ఘనంగా స్వాగతించిన ఎన్డీఏ కూటమి శ్రేణులు – ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుకు శుభాకాంక్షలు
- ఎన్ టి ఆర్ జిల్లా

నూతన ఆంగ్ల సంవత్సరాన్ని ఘనంగా స్వాగతించిన ఎన్డీఏ కూటమి శ్రేణులు – ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుకు శుభాకాంక్షలు

నూతన ఆంగ్ల సంవత్సరాన్ని ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ను పలకరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు స్వగ్రామమైన ఐతవరం గ్రామానికి గురువారం భారీగా తరలివచ్చారు. నేరుగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా తమ అభిమానాన్ని చాటుకున్నారు.అందరినీ ఆప్యాయంగా స్వాగతించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు, పేరు పేరునా పలకరిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 సంవత్సరం ప్రజలందరికీ సంతోషం, శ్రేయస్సు కలిగించాలని ఆకాంక్షించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అన్నారు. పేదల సంక్షేమంతో పాటు ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మైలవరం నియోజకవర్గ పరిధిలోని విజయవాడ రూరల్, ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ, జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం మండలాల నుంచి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ను కలిశారు.

నూతన ఆంగ్ల సంవత్సరాన్ని ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ను పలకరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు స్వగ్రామమైన ఐతవరం గ్రామానికి గురువారం భారీగా తరలివచ్చారు. నేరుగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా తమ అభిమానాన్ని చాటుకున్నారు.అందరినీ ఆప్యాయంగా స్వాగతించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు, పేరు పేరునా పలకరిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 సంవత్సరం ప్రజలందరికీ సంతోషం, శ్రేయస్సు కలిగించాలని ఆకాంక్షించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అన్నారు. పేదల సంక్షేమంతో పాటు ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మైలవరం నియోజకవర్గ పరిధిలోని విజయవాడ రూరల్, ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ, జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం మండలాల నుంచి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ను కలిశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.