Wednesday, 18 February 2026
  • Home  
  • నారద పుష్కరిణిలో జలక్రీడలాడిన ఆదిదంపతులు-కన్నులపండువగా తెప్పోత్సవం
- తిరుపతి

నారద పుష్కరిణిలో జలక్రీడలాడిన ఆదిదంపతులు-కన్నులపండువగా తెప్పోత్సవం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 17: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్ల తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. రంగురంగుల విద్యుత్ దీపాలతో, సుమమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై ఆదిదంపతులు కొలువుదీరి భక్తులకు కనువిందు చేశారు. జలక్రీడల మహోత్సవంలో భాగంగా స్వామి, అమ్మవార్లు తెప్పపై విహరిస్తుండగా, భక్తులు భక్తిపారవశ్యంతో శివనామ స్మరణ చేశారు. విద్యుత్ కాంతుల నడుమ జలాలపై స్వామివారి ఊరేగింపు అపురూప ఆధ్యాత్మిక అనుభూతిని మిగిల్చింది. ఈ వేడుకను వీక్షించేందుకు నారద పుష్కరిణిలో భక్తులు పోటెత్తారు. తెప్పోత్సవానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. క్యూలైన్లు, రక్షణ చర్యలు మరియు తాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై మెండుగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ దంపతులు, పాలక మండలి సబ్యులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 17: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్ల తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. రంగురంగుల విద్యుత్ దీపాలతో, సుమమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై ఆదిదంపతులు కొలువుదీరి భక్తులకు కనువిందు చేశారు. జలక్రీడల మహోత్సవంలో భాగంగా స్వామి, అమ్మవార్లు తెప్పపై విహరిస్తుండగా, భక్తులు భక్తిపారవశ్యంతో శివనామ స్మరణ చేశారు. విద్యుత్ కాంతుల నడుమ జలాలపై స్వామివారి ఊరేగింపు అపురూప ఆధ్యాత్మిక అనుభూతిని మిగిల్చింది. ఈ వేడుకను వీక్షించేందుకు నారద పుష్కరిణిలో భక్తులు పోటెత్తారు. తెప్పోత్సవానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. క్యూలైన్లు, రక్షణ చర్యలు మరియు తాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై మెండుగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ దంపతులు, పాలక మండలి సబ్యులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.