Monday, 23 March 2026
  • Home  
  • నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ (Operation LUNGS) 2.0 లో ఆక్రమణల తొలగింపుల కొనసాగింపు * జీవీఎంసీ పరిధిలో బుధవారం 373 ఆక్రమణల తొలగింపు.
- విశాఖపట్నం

నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ (Operation LUNGS) 2.0 లో ఆక్రమణల తొలగింపుల కొనసాగింపు * జీవీఎంసీ పరిధిలో బుధవారం 373 ఆక్రమణల తొలగింపు.

నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ (Operation LUNGS) 2.0 లో ఆక్రమణల తొలగింపుల కొనసాగింపు * జీవీఎంసీ పరిధిలో బుధవారం 373 ఆక్రమణల తొలగింపు. – జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ.ప్రభాకర్ రావు *విశాఖపట్నం డిసెంబర్పు 17 పున్నమి ప్రతినిధి* మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో అన్ని జోన్ల లో ఆపరేషన్ లంగ్స్ 2.0 లో భాగంగా 373 ఆక్రమణలను బుధవారం తొలగించడం జరిగిందని జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ. ప్రభాకర్ రావు బుధవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు నగర పరిధిలో ప్రజలు సురక్షితంగా ఫుట్ పాతులపై నడక సాగించేందుకు, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో లో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా రోడ్లు, జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు అడ్డంకులు లేకుండా సురక్షిత రవాణా కోసమై జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ (Operation Lungs) 2.0 లో భాగంగా అన్ని జోన్లలో రోడ్లపై జంక్షన్లలో ఆక్రమణలు తొలగించడం జరుగుతుందని చీఫ్ సిటీ ప్లానర్ తెలిపారు. తొలగించిన ఆక్రమణలను ఈ క్రింద పొందుపరచడమైనది. 1వ జోన్ పరిధిలో తిమ్మాపురం నుండి భీమిలి వరకు 8 ఆక్రమణలు, 2వ జోన్ పరిధిలో పీఎం పాలెం ఆఖరి బస్ స్టాప్ నుండి N H-16 (కార్ షెడ్ జంక్షన్) వరకు, బోయపాలెం జంక్షన్ నుండి N H-16 వరకు 37 ఆక్రమణలు, 3వ జోన్ పరిధిలో సంపత్ వినాయక టెంపుల్ రోడ్డు, వి ఐ పి రోడ్డు నుండి రామా టాకీస్ రోడ్డు వరకు, ఆర్ టి సి కాంప్లెక్ష్ BRTS రోడ్డు నుండి మద్దిలపాలెం వరకు, మద్దిలపాలెం డిపో నుండి ఇసుకతోట హైవే వరకు 84 ఆక్రమణలు, 4వ జోన్ పరిధిలో యూనియన్ బ్యాంకు దొండబజార్ రోడ్ నుండి ఫిష్ మార్కెట్ దొండబజార్ రోడ్ వరకు, దొండబాజార్ మెయిన్ రోడ్ నుండి MVDM హై స్కూల్ దొండబాజార్ రోడ్డు వరకు 49 ఆక్రమణలు, నార్త్ జోన్ పరిధిలో 80 ఫీట్ రోడ్డు నుండి రైల్వే న్యూ కాలనీ ఆర్చ్ వరకు 32 ఆక్రమణలు, 6వ జోన్ పరిధిలో బీసీ రోడ్డు జంక్షన్ నుండి గంగవరం పోర్టు రోడ్డు వరకు, శ్రీనగర్ జంక్షన్ నుండి దుర్గా నగర్ రోడ్డు వరకు, వేపచెట్టు జంక్షన్ నుండి 60 ఫీట్ రోడ్డు వరకు, పెదగంట్యాడ జంక్షన్ నుండి న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ వరకు 114 ఆక్రమణలు, 6వ జోన్ పరిధిలో GNT రోడ్డు నుండి పెరుగు బజార్ జంక్షన్ వరకు 12 ఆక్రమణలు వెస్ట్ జోన్ పరిధిలో శ్రీ హరి పురం జంక్షన్ నుండి జవహర్ నగర్ వరకు 10 ఆక్రమణలు, 8వ జోన్ పరిధిలో కృష్ణాపురం జంక్షన్ నుండి చినముసిడివాడ వరకు 22 ఆక్రమణలతో కలిపి మొత్తం 373 ఆక్రమణలు తొలగించడం జరిగిందని ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా జోన్ల కమిషనర్లు, సహాయక ప్రణాళిక అధికారులు, ప్రణాళిక విభాగం సిబ్బంది, సచివాలయం సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ (Operation LUNGS) 2.0 లో ఆక్రమణల తొలగింపుల కొనసాగింపు
* జీవీఎంసీ పరిధిలో బుధవారం 373 ఆక్రమణల తొలగింపు.

– జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ.ప్రభాకర్ రావు

*విశాఖపట్నం డిసెంబర్పు 17 పున్నమి ప్రతినిధి* మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో అన్ని జోన్ల లో ఆపరేషన్ లంగ్స్ 2.0 లో భాగంగా 373 ఆక్రమణలను బుధవారం తొలగించడం జరిగిందని జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ. ప్రభాకర్ రావు బుధవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు నగర పరిధిలో ప్రజలు సురక్షితంగా ఫుట్ పాతులపై నడక సాగించేందుకు, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో లో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా రోడ్లు, జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు అడ్డంకులు లేకుండా సురక్షిత రవాణా కోసమై జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ (Operation Lungs) 2.0 లో భాగంగా అన్ని జోన్లలో రోడ్లపై జంక్షన్లలో ఆక్రమణలు తొలగించడం జరుగుతుందని చీఫ్ సిటీ ప్లానర్ తెలిపారు.

తొలగించిన ఆక్రమణలను ఈ క్రింద పొందుపరచడమైనది.
1వ జోన్ పరిధిలో తిమ్మాపురం నుండి భీమిలి వరకు 8 ఆక్రమణలు,
2వ జోన్ పరిధిలో పీఎం పాలెం ఆఖరి బస్ స్టాప్ నుండి N H-16 (కార్ షెడ్ జంక్షన్) వరకు, బోయపాలెం జంక్షన్ నుండి N H-16 వరకు 37 ఆక్రమణలు,
3వ జోన్ పరిధిలో సంపత్ వినాయక టెంపుల్ రోడ్డు, వి ఐ పి రోడ్డు నుండి రామా టాకీస్ రోడ్డు వరకు, ఆర్ టి సి కాంప్లెక్ష్ BRTS రోడ్డు నుండి మద్దిలపాలెం వరకు, మద్దిలపాలెం డిపో నుండి ఇసుకతోట హైవే వరకు 84 ఆక్రమణలు,
4వ జోన్ పరిధిలో యూనియన్ బ్యాంకు దొండబజార్ రోడ్ నుండి ఫిష్ మార్కెట్ దొండబజార్ రోడ్ వరకు, దొండబాజార్ మెయిన్ రోడ్ నుండి MVDM హై స్కూల్ దొండబాజార్ రోడ్డు వరకు 49 ఆక్రమణలు,
నార్త్ జోన్ పరిధిలో 80 ఫీట్ రోడ్డు నుండి రైల్వే న్యూ కాలనీ ఆర్చ్ వరకు 32 ఆక్రమణలు,
6వ జోన్ పరిధిలో బీసీ రోడ్డు జంక్షన్ నుండి గంగవరం పోర్టు రోడ్డు వరకు, శ్రీనగర్ జంక్షన్ నుండి దుర్గా నగర్ రోడ్డు వరకు, వేపచెట్టు జంక్షన్ నుండి 60 ఫీట్ రోడ్డు వరకు, పెదగంట్యాడ జంక్షన్ నుండి న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ వరకు 114 ఆక్రమణలు,
6వ జోన్ పరిధిలో GNT రోడ్డు నుండి పెరుగు బజార్ జంక్షన్ వరకు 12 ఆక్రమణలు
వెస్ట్ జోన్ పరిధిలో శ్రీ హరి పురం జంక్షన్ నుండి జవహర్ నగర్ వరకు 10 ఆక్రమణలు,
8వ జోన్ పరిధిలో కృష్ణాపురం జంక్షన్ నుండి చినముసిడివాడ వరకు 22 ఆక్రమణలతో కలిపి
మొత్తం 373 ఆక్రమణలు తొలగించడం జరిగిందని ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆయా జోన్ల కమిషనర్లు, సహాయక ప్రణాళిక అధికారులు, ప్రణాళిక విభాగం సిబ్బంది, సచివాలయం సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.