Monday, 8 December 2025
  • Home  
  • నంద్యాల జిల్లాలో వీఆర్ఐ టిటిఐ బృందం ప్రకృతి వ్యవసాయ పర్యటన
- నంద్యాల

నంద్యాల జిల్లాలో వీఆర్ఐ టిటిఐ బృందం ప్రకృతి వ్యవసాయ పర్యటన

ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలపై లోతైన అవగాహన కోసం కర్నాటక రాష్ట్రం,బెంగుళూరు సిటీ, వీఆర్ఐటిటిఐ సంస్థ నుండి వచ్చిన 04 మంది సభ్యులు నంద్యాల జిల్లాలో మంగళవారం పర్యటించారు. వీఆర్ఐటిటిఐ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వం, స్వయం సమృద్ధి మరియు జీవన ప్రమాణాల మెరుగుదల కోసం కృషి చేసే సంస్థ.ఈ సంస్థ గ్రామీణ కుటుంబాలకు వివిధ ఉపాధి అవకాశాలు,నైపుణ్య శిక్షణ,వ్యవసాయం-ఆధారిత ప్రోత్సాహక చర్యలు,మరియు మార్కెట్ లింకేజీలు అందిస్తూ, ప్రధానంగా ఎస్ హెచ్ జి ఎస్ , ఎఫ్ పి ఓ ఎస్,యువత, మహిళలను బలోపేతం చేసి, స్థిరమైన ఆదాయం,మరియు గౌరవప్రదమైన జీవన విధానం సాధించడానికి దోహదపడుతుంది. వీఆర్ఐటిటిఐ కృషి వలన అనేక కుటుంబాలు శాశ్వత జీవనోపాధి అవకాశాలు పొందుతూ ఆర్థిక భద్రతను అందుకుంటున్నాయి.ఈ క్షేత్ర సందర్శనలో భాగంగా ఏడీపీఎం అబ్దుల్ సలాం నేతృత్వంలో వీఆర్ఐటిటిఐ బృందం నంద్యాల జిల్లాలోని పలు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి,ఇక్కడి రైతులు అనుసరిస్తున్న వినూత్న పద్ధతులను తెలుసుకున్నారు.ముందుగా ప్యాపిలి మండలం,బావిపల్లి, నేరెడుచెర్ల యూనిట్లకు చెందిన ఐసీఆర్పీలు కలిసి సాగు చేస్తున్నటువంటి ఏటియం (ఎనీ టైం మనీ) మోడల్ను పరిశీలించారు. 1.20 ఎకరాల విస్తీర్ణంలో 18 రకాల పంటల వైవిధ్యంతో సాగు చేస్తున్న విధానాలను వారు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.ప్రకృతి వ్యవసాయంలో కీలకమైన తొమ్మిది సార్వత్రిక సూత్రాలను రైతు ఎలా అనుసరిస్తున్నారో, పంటల ఎంపికలో ఆయన అనుసరించిన పద్ధతి ని బృందం సభ్యులు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. పంటల వైవిధ్యాన్ని,దాని ద్వారా సాధిస్తున్న విజయాలను బృందం ఎంతగానో మెచ్చుకుంది. ఆ‌ తర్వాత అదే గ్రామంలో జలదుర్గం ప్రకృతి వ్యవసాయ యూనిట్ ఇన్చార్జ్ వెంకటప్ప సాగు చేస్తున్న ఏ-గ్రేడ్ కంది పంటను బృందం వీక్షించింది.వెంకటప్ప అనుసరిస్తున్న అంతర పంటలు,సరిహద్దు పంటల ప్రయోజనాలను బృందం తెలుసుకుంది.వీటి ద్వారా అదనపు ఆదాయాన్ని ఎలా పొందుతున్నారో రైతు వివరించారు.పలు పంటలు వేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం సాధ్యమవుతుందని బృందం అభిప్రాయపడింది. తదుపరి,జలదుర్గం గ్రామంలో మహిళా సంఘాల(ఎస్ హెచ్ జి)సభ్యులతో వీఆర్ఐటిటిఐ బృందం సమావేశమైంది.ఈ సందర్భంగా మహిళలు తమ అనుభవాలను పంచుకున్నారు.ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం వల్ల తమ కుటుంబ ఆరోగ్యం మెరుగుపడిందని,తక్కువ ఖర్చుతో పంట దిగుబడులు సాధ్యమయ్యాయని వారు వివరించారు.అలాగే గృహోపయోగానికి అవసరమైన కూరగాయలను తాము స్వయంగా పండించుకోవడం వల్ల ఖర్చు తగ్గిందని,ఆదాయం కూడా పెరిగిందని తెలిపారు. తరువాత క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వీఆర్ఐటిటి ఐ బృందం,కేడర్ సభ్యులు తమ బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నారో,రైతులతో వారు ఎంత సమీపంగా పని చేస్తున్నారు,శిక్షణలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనే అంశాలను తెలుసుకున్నారు. ఈ ఫీల్డ్ విజిట్ కార్యక్రమంలో వీఆర్ఐటిటిఐ బృందం సభ్యులు రాగిని,రఘు, సందీప్, శరత్ తో పాటు,రైతు సాధికార సంస్థ, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ జలాలుద్దీన్,ప్రకృతి వ్యవసాయ అదనపు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ అబ్దుల్ సలాం,యం.యం.టి.యల్ భీమేష్, ఎన్.ఎఫ్.ఎ సునంద,ప్రకృతి వ్యవసాయ సిబ్బంది యమ్.టి లు,యూనిట్ఇన్చార్జ్లు,ఐసీఆర్పీలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలపై లోతైన అవగాహన కోసం కర్నాటక రాష్ట్రం,బెంగుళూరు సిటీ,
వీఆర్ఐటిటిఐ సంస్థ నుండి వచ్చిన 04 మంది సభ్యులు నంద్యాల జిల్లాలో మంగళవారం పర్యటించారు. వీఆర్ఐటిటిఐ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వం, స్వయం సమృద్ధి మరియు జీవన ప్రమాణాల మెరుగుదల కోసం కృషి చేసే సంస్థ.ఈ సంస్థ గ్రామీణ కుటుంబాలకు వివిధ ఉపాధి అవకాశాలు,నైపుణ్య శిక్షణ,వ్యవసాయం-ఆధారిత ప్రోత్సాహక చర్యలు,మరియు మార్కెట్ లింకేజీలు అందిస్తూ, ప్రధానంగా ఎస్ హెచ్ జి ఎస్ , ఎఫ్ పి ఓ ఎస్,యువత, మహిళలను బలోపేతం చేసి, స్థిరమైన ఆదాయం,మరియు గౌరవప్రదమైన జీవన విధానం సాధించడానికి దోహదపడుతుంది. వీఆర్ఐటిటిఐ కృషి వలన అనేక కుటుంబాలు శాశ్వత జీవనోపాధి అవకాశాలు పొందుతూ ఆర్థిక భద్రతను అందుకుంటున్నాయి.ఈ క్షేత్ర సందర్శనలో భాగంగా ఏడీపీఎం అబ్దుల్ సలాం నేతృత్వంలో వీఆర్ఐటిటిఐ బృందం నంద్యాల జిల్లాలోని పలు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి,ఇక్కడి రైతులు అనుసరిస్తున్న వినూత్న పద్ధతులను తెలుసుకున్నారు.ముందుగా ప్యాపిలి మండలం,బావిపల్లి, నేరెడుచెర్ల యూనిట్లకు చెందిన ఐసీఆర్పీలు కలిసి సాగు చేస్తున్నటువంటి ఏటియం (ఎనీ టైం మనీ) మోడల్ను పరిశీలించారు. 1.20 ఎకరాల విస్తీర్ణంలో 18 రకాల పంటల వైవిధ్యంతో సాగు చేస్తున్న విధానాలను వారు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.ప్రకృతి వ్యవసాయంలో కీలకమైన తొమ్మిది సార్వత్రిక సూత్రాలను రైతు ఎలా అనుసరిస్తున్నారో, పంటల ఎంపికలో ఆయన అనుసరించిన పద్ధతి ని బృందం సభ్యులు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. పంటల వైవిధ్యాన్ని,దాని ద్వారా సాధిస్తున్న విజయాలను బృందం ఎంతగానో మెచ్చుకుంది.
ఆ‌ తర్వాత అదే గ్రామంలో జలదుర్గం ప్రకృతి వ్యవసాయ యూనిట్ ఇన్చార్జ్ వెంకటప్ప సాగు చేస్తున్న ఏ-గ్రేడ్ కంది పంటను బృందం వీక్షించింది.వెంకటప్ప అనుసరిస్తున్న అంతర పంటలు,సరిహద్దు పంటల ప్రయోజనాలను బృందం తెలుసుకుంది.వీటి ద్వారా అదనపు ఆదాయాన్ని ఎలా పొందుతున్నారో రైతు వివరించారు.పలు పంటలు వేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం సాధ్యమవుతుందని బృందం అభిప్రాయపడింది.
తదుపరి,జలదుర్గం గ్రామంలో మహిళా సంఘాల(ఎస్ హెచ్ జి)సభ్యులతో వీఆర్ఐటిటిఐ బృందం సమావేశమైంది.ఈ సందర్భంగా మహిళలు తమ అనుభవాలను పంచుకున్నారు.ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం వల్ల తమ కుటుంబ ఆరోగ్యం మెరుగుపడిందని,తక్కువ ఖర్చుతో పంట దిగుబడులు సాధ్యమయ్యాయని వారు వివరించారు.అలాగే గృహోపయోగానికి అవసరమైన కూరగాయలను తాము స్వయంగా పండించుకోవడం వల్ల ఖర్చు తగ్గిందని,ఆదాయం కూడా పెరిగిందని తెలిపారు. తరువాత క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వీఆర్ఐటిటి ఐ బృందం,కేడర్ సభ్యులు తమ బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నారో,రైతులతో వారు ఎంత సమీపంగా పని చేస్తున్నారు,శిక్షణలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనే అంశాలను తెలుసుకున్నారు.
ఈ ఫీల్డ్ విజిట్ కార్యక్రమంలో వీఆర్ఐటిటిఐ బృందం సభ్యులు రాగిని,రఘు, సందీప్, శరత్ తో పాటు,రైతు సాధికార సంస్థ, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ జలాలుద్దీన్,ప్రకృతి వ్యవసాయ అదనపు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ అబ్దుల్ సలాం,యం.యం.టి.యల్ భీమేష్, ఎన్.ఎఫ్.ఎ సునంద,ప్రకృతి వ్యవసాయ సిబ్బంది యమ్.టి లు,యూనిట్ఇన్చార్జ్లు,ఐసీఆర్పీలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.