నందిగామ బస్టాండ్‌లో సోమవారం సాయంత్రం ఓ గుర్తుతెలియని వ్యక్తి మర్మమైన రీతిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. సుమారు 55–60 ఏళ్ళు వయస్సు గల వ్యక్తి పెనుగంచిప్రోలు నుంచి నందిగామకు వచ్చిన బస్‌లో ప్రయాణించి, బస్ దిగిన కొద్ది సేపటికే అక్కడికక్కడే కుప్పకూలినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. తెలుసుకునే సరికి అతడి తల వెనుక భాగంలో రక్తగాయం కనిపించడంతో అక్కడున్నవారు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది అతన్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ డ్యూటీ డాక్టర్ ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు.
మృతుడు తెల్లని నిండు చేతుల చొక్కా, బ్లూ రంగులో తెలుపు– ఎరుపు పూల డిజైన్ ఉన్న లుంగీ ధరించి ఉన్నాడు. అతని జేబులో పెనుగంచిప్రోలు నుండి నందిగామ వరకు ఉన్న RTC టికెట్ మాత్రమే లభించిందని పోలీసులు వెల్లడించారు.
పేరు–ఊరు తెలియని ఈ వ్యక్తి ఎత్తు సుమారు 5 అడుగులు, రంగు చామనచాయగా ఉన్నాడని పోలీసులుతెలిపారు.
ఈ వ్యక్తిని గుర్తించగల వారు క్రింది నంబర్లకు సమాచారం ఇవ్వాల్సిందిగా నందిగామ పోలీసులు కోరుతున్నారు:
CI/SHO Y.V.V.L.నాయుడు – 8332983808
SI Y.V. సాతకర్ణి – 9440796456
SI B.మొంహనా రావు – 9440796457
నందిగామ పోలీస్ స్టేషన్ – 08678-275233

నందిగామ బస్టాండ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
నందిగామ బస్టాండ్‌లో సోమవారం సాయంత్రం ఓ గుర్తుతెలియని వ్యక్తి మర్మమైన రీతిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. సుమారు 55–60 ఏళ్ళు వయస్సు గల వ్యక్తి పెనుగంచిప్రోలు నుంచి నందిగామకు వచ్చిన బస్‌లో ప్రయాణించి, బస్ దిగిన కొద్ది సేపటికే అక్కడికక్కడే కుప్పకూలినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. తెలుసుకునే సరికి అతడి తల వెనుక భాగంలో రక్తగాయం కనిపించడంతో అక్కడున్నవారు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది అతన్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ డ్యూటీ డాక్టర్ ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడు తెల్లని నిండు చేతుల చొక్కా, బ్లూ రంగులో తెలుపు– ఎరుపు పూల డిజైన్ ఉన్న లుంగీ ధరించి ఉన్నాడు. అతని జేబులో పెనుగంచిప్రోలు నుండి నందిగామ వరకు ఉన్న RTC టికెట్ మాత్రమే లభించిందని పోలీసులు వెల్లడించారు. పేరు–ఊరు తెలియని ఈ వ్యక్తి ఎత్తు సుమారు 5 అడుగులు, రంగు చామనచాయగా ఉన్నాడని పోలీసులుతెలిపారు. ఈ వ్యక్తిని గుర్తించగల వారు క్రింది నంబర్లకు సమాచారం ఇవ్వాల్సిందిగా నందిగామ పోలీసులు కోరుతున్నారు: CI/SHO Y.V.V.L.నాయుడు – 8332983808 SI Y.V. సాతకర్ణి – 9440796456 SI B.మొంహనా రావు – 9440796457 నందిగామ పోలీస్ స్టేషన్ – 08678-275233

