Wednesday, 18 March 2026
  • Home  
  • తెలుగు సంవత్సరాది ఉగాది (కవిత) – డాక్టర్ బద్రి పీర్ కుమార్
- సాహితీ

తెలుగు సంవత్సరాది ఉగాది (కవిత) – డాక్టర్ బద్రి పీర్ కుమార్

ఇది పరాభవ నామ సంవత్సరం నూతనోత్సాహానికి శ్రీకారం పరాభవమా అని నిరుత్సాహకరం? కొందరికి కానీ మానవుడు ప్రకృతి సిద్ధంగా సహజంగా తన జీవనాన్ని కొనసాగిస్తే ఈ పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి పరాభవం కాదు వైభవం సంప్రాప్తిస్తుందని, ఈ ఉగాది మనందరి ఉజ్వల భవిష్యత్తుకు పునాది కావాలని కోరుకుంటూ … ప్రకృతి ప్రథమ పండుగ జీవరాసికిది నిండుగ పరిసరాలు కనులవిందుగ మది మదిని ఉల్లాసపరచగ మానవాళిని ఆహ్లాద పరిచే వాతావరణం జీవనంపై ప్రభావం చూపే ప్రకృతిశోషణం జరగబోయే మార్పులు తెలిపే జనాభాగణనం గ్రహస్థితి మార్పుల విశ్లేషణం మానవ చర్యల సంయమనం పఠణం శ్రవణం మననం ఇందులో మనం భిన్న భావాల సమ్మేళనం కళామతల్లికి కమనీయ కవననీరాజనం ఈ సందర్భంగా అక్షరాత్మక భావత్మక రక్షణ లక్షణ శుభాకాంక్షావలి ప్రథమాక్షర వాక్యసుమాంజలి ఈ కవిత. *తె* తెలుగుజాతి తేజస్సుకు ఉషస్సు *లు* లుమాల సాంకేతికం నేటి కృత్రిమ మేధస్సు *గు* గుణగణాత్మక పర్యావరణం శ్రేయస్సు *సం* సంక్షేమ సమాజానికి ఆయుష్షు *వ* వసంతం మనసొంతమనే మనస్సు *త్స* ఉత్సాహ ప్రోత్సాహక తపనల తపస్సు *రా* రాగమాలికల నిత్య యవ్వనవయస్సు *ది* దివ్యానుభూతి కలిగించు ప్రకృతిమాత ఆశీస్సు *ఉ* ఉన్నత నవీకరణ భావ బ్రహ్మోత్సవం *గా* గానామృత పంచాంగ శ్రవణ వైభవం *ది* దినదినాభివృద్ధి ప్రజాసంక్షేమ సౌష్టవం *శు* శుభకామనల సౌభాగ్య భావనలు *భా* భాగ్యరేఖల సూచనాత్మక ఆచరణలు *కాం* కాంక్షల సమృద్ధి బాటలో కార్యాలు *క్ష* క్షణక్షణం ప్రతిధ్వనించు ప్రవచనరాగాలు *లు* లున్నతము చేయగ నవజీవన గమనాలు ప్రకృతి సమీప స్నేహాత్మక పయనం సాహిత్య సంస్కృతి సమ్మేళన స్మరణం వర్తమాన భవిష్యత్ విజయాలకు నిదర్శనం మనసోల్లాస విజయాంస సంపూర్ణ సందర్శనం

ఇది పరాభవ నామ సంవత్సరం
నూతనోత్సాహానికి శ్రీకారం
పరాభవమా అని నిరుత్సాహకరం? కొందరికి కానీ
మానవుడు ప్రకృతి సిద్ధంగా సహజంగా తన జీవనాన్ని కొనసాగిస్తే ఈ పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి పరాభవం కాదు వైభవం సంప్రాప్తిస్తుందని, ఈ ఉగాది మనందరి ఉజ్వల భవిష్యత్తుకు పునాది కావాలని కోరుకుంటూ …

ప్రకృతి ప్రథమ పండుగ
జీవరాసికిది నిండుగ
పరిసరాలు కనులవిందుగ
మది మదిని ఉల్లాసపరచగ

మానవాళిని ఆహ్లాద పరిచే వాతావరణం
జీవనంపై ప్రభావం చూపే ప్రకృతిశోషణం
జరగబోయే మార్పులు తెలిపే జనాభాగణనం
గ్రహస్థితి మార్పుల విశ్లేషణం

మానవ చర్యల సంయమనం
పఠణం శ్రవణం మననం ఇందులో మనం
భిన్న భావాల సమ్మేళనం
కళామతల్లికి కమనీయ కవననీరాజనం

ఈ సందర్భంగా అక్షరాత్మక భావత్మక రక్షణ లక్షణ శుభాకాంక్షావలి
ప్రథమాక్షర వాక్యసుమాంజలి ఈ కవిత.

*తె* తెలుగుజాతి తేజస్సుకు ఉషస్సు
*లు* లుమాల సాంకేతికం నేటి కృత్రిమ మేధస్సు
*గు* గుణగణాత్మక పర్యావరణం శ్రేయస్సు

*సం* సంక్షేమ సమాజానికి ఆయుష్షు
*వ* వసంతం మనసొంతమనే మనస్సు
*త్స* ఉత్సాహ ప్రోత్సాహక తపనల తపస్సు
*రా* రాగమాలికల నిత్య యవ్వనవయస్సు
*ది* దివ్యానుభూతి కలిగించు ప్రకృతిమాత ఆశీస్సు

*ఉ* ఉన్నత నవీకరణ భావ బ్రహ్మోత్సవం
*గా* గానామృత పంచాంగ శ్రవణ వైభవం
*ది* దినదినాభివృద్ధి ప్రజాసంక్షేమ సౌష్టవం

*శు* శుభకామనల సౌభాగ్య భావనలు
*భా* భాగ్యరేఖల సూచనాత్మక ఆచరణలు
*కాం* కాంక్షల సమృద్ధి బాటలో కార్యాలు
*క్ష* క్షణక్షణం ప్రతిధ్వనించు ప్రవచనరాగాలు
*లు* లున్నతము చేయగ నవజీవన గమనాలు

ప్రకృతి సమీప స్నేహాత్మక పయనం
సాహిత్య సంస్కృతి సమ్మేళన స్మరణం
వర్తమాన భవిష్యత్ విజయాలకు నిదర్శనం
మనసోల్లాస విజయాంస సంపూర్ణ సందర్శనం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.