పున్నమి ప్రతినిధి, తిరుపతి
తిరుపతి పార్లమెంట్ టీడీపీ ఆధ్వర్యంలోడాలర్స్ దివాకర్ రెడ్డి నాయకత్వంలో తిరుపతి పార్లమెంట్ తెలుగు దేశం పార్టీ స్వంత కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమం సోమవారం అవిలాలలో ఘనంగా నిర్వహించబడింది.
తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి , పార్లమెంట్ కోఆర్డినేటర్ & ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే సుళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్సహా పలువురు ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మహానేత నందమూరి తారక రామారావు ఆత్మగౌరవ స్పూర్తితో స్థాపితమైన తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో అభివృద్ధి రాజకీయాలకు మార్గదర్శక శక్తిగా నిలుస్తోంది. యువనేత నారా లోకేష్ చైతన్యంతో పార్టీ మరింత బలోపేతంఅవుతుందిఅన్నారు.ఇది కేవలం భవనం శంకుస్థాపన కాదు, ఇది ప్రతి కార్యకర్త ఆశయాలకు పునాది, ఇది తిరుపతి పార్లమెంట్ టిడిపి ఆత్మగౌరవానికి శాశ్వత నిలయం అన్నారు.
ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.



