పున్నమి ప్రతినిధి 31 మార్చి తిరుపతి
తిరుపతి జిల్లా సహకార శాఖా సిబ్బంది కి తిరుపతి లోని యూత్ హాస్టల్ తిరుపతి జిల్లా సహకార శాఖ సిబ్బందికి మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సహకార శాఖ అధికారి ఎస్.వి. నాగవర్ధన, జిల్లా సహకార ఆడిట్ అధికారి బ్రహ్మానంద రెడ్డి , సహకార శాఖ డివిజనల్ ఆఫీసర్ సురేష్ హాజరై నాగభూషణం సబ్-డివిజనల్ ఆఫీసర్ వారు ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఏ. ఝాన్సీ ఉద్యోగులకు శిక్షణ అందించారు. శిక్షణలో భాగంగా సెక్షన్ 71 మరియు రూల్ 52, ఎగ్జిక్యూషన్ అఫ్ డిక్రెస్ ననుసరించి కీలక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార విద్యాధికారి కె. సుధాకర్ ఈ కార్యక్రమమునకు సహాయ సహకారులు అందించిన సహకార అధికారులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ హాజరైన సహకార శాఖ సిబ్బందికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి వందన సమర్పణ తో విజయవంతంగా ముగిసింది



