హెడ్లైన్:
ఖమ్మం, మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి):
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు పితృవియోగం సంభవించింది. ఆయన తండ్రి లచ్చ నాయక్ మంగళవారం అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఈ వార్త తెలిసి కుటుంబ సభ్యులు, అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
లచ్చ నాయక్ మృతిపై పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు, ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షుడు ధనియకుల వెంకట్ నారాయణ ఖమ్మం రూరల్ అధ్యక్షులు జాటోత్సా మధు నాయక్ తదితరులు వారి కుటుంబం కి సంతాపం తెలియజేసారు



