జవహర్ భారతి విద్యార్ధి కావడం అదృష్టం
ఎ.పి.టూరిజం ఛైర్మన్ బాలాజీ
జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో (ఏప్రిల్ పున్నమి)
ప్రతిష్టాత్మకమైన జవహర్ భారతి విద్యార్ధిని కావడం తన పూర్వ జన్మ సుకృతం అని ఎ.పి.టూరిజం ఛైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ పేర్కొన్నారు.
శనివారం జవహర్ భారతి కళాశాల స్పోర్ట్స్ డే కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయనకు కళాశాల పూర్వ విద్యార్ధి నేత గా ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ నాడు డాక్టర్ డి.ఆర్ దూరదృష్టి తో ఏర్పాటు చేసిన జవహర్ భారతి నెల్లూరు ప్రకాశం జిల్లాలలో నుంచి వేలమంది పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు వెలుగునిచ్చిందని అన్నారు. విద్యార్ధి గానే కాక , విద్యార్థి సంఘ నేత గా జవహర్ భారతి తో తనకు మరిచిపోలేని బంధం ఉందని అన్నారు. కేవలం విద్యకే పరిమితం కాకుండా సామాజిక స్పృహ ను కలిగించేలా,సమాజం పట్ల పౌరుడిగా నిర్వహించాల్సిన బాధ్యత ను జవహర్ భారతి లో నేర్చుకున్నానని, అదే నేడు తనను ప్రస్తుత రాజకీయ రంగంలో అగ్రభాగాన ఉంచిందని అన్నారు. నాటి విద్యార్థి తో పోలిస్తే నేడు విద్యార్ధి లో బాధ్యతారాహిత్యం కనిపిస్తోందని దీని నివారణకు ఉపాధ్యాయులే కాక తల్లితండ్రులు కూడా దృష్టి పెట్టాలని బాలాజీ కోరారు. కేవలం విద్యకు మార్కులకు పరిమితం అయ్యే వాతావరణం కు స్వస్తి పలుకాలని, క్రీడలు సామాజిక అంశాలకు సమయం కేటాయించినపుడే ఉత్తమ పౌరులు వస్తారని బాలాజీ పేర్కొన్నారు. కరస్పొండెంట్ సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో
విజేతలైన విద్యార్థులకు బాలాజీ బహుమతులు అందించారు. విలువలు కలిగిన బాలాజీ,కృపారావులు నేడు ఎంతో ఉన్నత స్థాయికి ఎదగడం జవహర్ భారతి కే గర్వకారణం అని సుధాకర్ రెడ్డి ప్రశంసించారు..
కార్యక్రమం లో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కృపొరావు, కళాశాల సెల్ఫ్ ఫైనాన్స్ డైరెక్టర్ ఆర్. మాల్యాద్రి, ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం నాయుడు ప్రసంగించారు, డాక్టర్ పి.డి.ప్రసాద్ రెడ్డి క్రీడా నివేదిక సమర్పిస్తూ యూనివర్సిటీ లో అద్భుతమైన విజయాలు సాధించినట్లు పేర్కొన్నారు.
జవహర్ భారతి విద్యార్ధి కావడం అదృష్టం ఎ.పి.టూరిజం ఛైర్మన్ బాలాజీ
జవహర్ భారతి విద్యార్ధి కావడం అదృష్టం ఎ.పి.టూరిజం ఛైర్మన్ బాలాజీ జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో (ఏప్రిల్ పున్నమి) ప్రతిష్టాత్మకమైన జవహర్ భారతి విద్యార్ధిని కావడం తన పూర్వ జన్మ సుకృతం అని ఎ.పి.టూరిజం ఛైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ పేర్కొన్నారు. శనివారం జవహర్ భారతి కళాశాల స్పోర్ట్స్ డే కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయనకు కళాశాల పూర్వ విద్యార్ధి నేత గా ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ నాడు డాక్టర్ డి.ఆర్ దూరదృష్టి తో ఏర్పాటు చేసిన జవహర్ భారతి నెల్లూరు ప్రకాశం జిల్లాలలో నుంచి వేలమంది పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు వెలుగునిచ్చిందని అన్నారు. విద్యార్ధి గానే కాక , విద్యార్థి సంఘ నేత గా జవహర్ భారతి తో తనకు మరిచిపోలేని బంధం ఉందని అన్నారు. కేవలం విద్యకే పరిమితం కాకుండా సామాజిక స్పృహ ను కలిగించేలా,సమాజం పట్ల పౌరుడిగా నిర్వహించాల్సిన బాధ్యత ను జవహర్ భారతి లో నేర్చుకున్నానని, అదే నేడు తనను ప్రస్తుత రాజకీయ రంగంలో అగ్రభాగాన ఉంచిందని అన్నారు. నాటి విద్యార్థి తో పోలిస్తే నేడు విద్యార్ధి లో బాధ్యతారాహిత్యం కనిపిస్తోందని దీని నివారణకు ఉపాధ్యాయులే కాక తల్లితండ్రులు కూడా దృష్టి పెట్టాలని బాలాజీ కోరారు. కేవలం విద్యకు మార్కులకు పరిమితం అయ్యే వాతావరణం కు స్వస్తి పలుకాలని, క్రీడలు సామాజిక అంశాలకు సమయం కేటాయించినపుడే ఉత్తమ పౌరులు వస్తారని బాలాజీ పేర్కొన్నారు. కరస్పొండెంట్ సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విజేతలైన విద్యార్థులకు బాలాజీ బహుమతులు అందించారు. విలువలు కలిగిన బాలాజీ,కృపారావులు నేడు ఎంతో ఉన్నత స్థాయికి ఎదగడం జవహర్ భారతి కే గర్వకారణం అని సుధాకర్ రెడ్డి ప్రశంసించారు.. కార్యక్రమం లో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కృపొరావు, కళాశాల సెల్ఫ్ ఫైనాన్స్ డైరెక్టర్ ఆర్. మాల్యాద్రి, ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం నాయుడు ప్రసంగించారు, డాక్టర్ పి.డి.ప్రసాద్ రెడ్డి క్రీడా నివేదిక సమర్పిస్తూ యూనివర్సిటీ లో అద్భుతమైన విజయాలు సాధించినట్లు పేర్కొన్నారు.