Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

చిట్వేల్‌లో కలకలం.. డ్రైవర్‌పై దాడి కేసులో ఆరుగురు అరెస్ట్

చిట్వేల్‌ : కారు డ్రైవర్‌పై పగ పెంచుకున్న కొందరు పథకం ప్రకారం అతడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేసిన ఘటనలో ఆరుగురు నిందితులను చిట్వేల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబరు 26న రాత్రి ఓ మహిళ ఫోన్‌ చేసి చెన్నై ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు కారు కావాలని శ్రీహరిని కోరింది. ఆమె సూచించిన ప్రాంతానికి వెళ్లిన అతడిని నిందితులు కారులో ఎక్కించుకుని చిట్వేల్‌–పుల్లంపేట ఘాట్‌ రోడ్డులోని వినాయక గుడి సమీపానికి తీసుకెళ్లారు. అక్కడ శ్రీహరి చేతులు, కాళ్లు కట్టేసి దాడి చేయడంతోపాటు సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేశారు. ఘటన గురించి బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కాల్‌డేటా, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితులను గుర్తించారు. సుమారు రెండేళ్ల క్రితం జరిగిన వ్యక్తిగత వివాదమే దాడికి కారణమని దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. తిమ్మయ్యగారిపల్లి మూసివేసిన హైస్కూల్‌ సమీపంలో శుక్రవారం ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి ఒక మోటార్‌సైకిల్‌, మూడు సెల్‌ఫోన్లు, మూడు కట్టెలు, ఒక ఇనుప రాడ్డు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *