రైల్వేకోడూరు సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ పులియాల రమేష్ బాబు గారు ఇటీవల టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి కుమారుడు, యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా, గ్రీన్ & బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించబడిన పులియాల రమేష్ బాబు గారిని ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు అభినందించారు.ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు మాట్లాడుతూ –”పులియాల రమేష్ బాబు గారు పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ, సాధారణ కార్యకర్తలకు ఆదర్శంగా నిలిచారు. ఆయన గ్రీన్ కార్పొరేషన్ డైరెక్టర్గా రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, పట్టణాల అందాల అభివృద్ధి కోసం విశేష కృషి చేస్తారని మేము నమ్ముతున్నాం.” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ఎన్డీయే కూటమి నాయకులు పాల్గొన్నారు.


