శ్రీకాళహస్తి, ఏప్రిల్ 18 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయానికి ఎస్.ఎస్.ఆర్ అకాడమీ ప్రతినిధి జి. మంజునాథ్ సుమారు 200 పోటీ పరీక్షల పుస్తకాలను విరాళంగా అందజేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి చేతుల మీదుగా శనివారం ఈ పుస్తకాలను గ్రంథాలయానికి సమర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ గురవారెడ్డి మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు మంజునాథ్ చేసిన ఈ సాయం ఎంతో దోహదపడుతుందన్నారు. మంజునాథ్‌ను స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు దాతలు గ్రంథాలయాల అభివృద్ధికి ముందుకు రావాలని కోరారు. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు తమ సామాజిక బాధ్యతగా ‘సీఎస్ఆర్’ (CSR) నిధుల ద్వారా గ్రంథాలయాలకు అవసరమైన మౌలిక వసతులు, పుస్తకాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 28 నుంచి గ్రంథాలయంలో ప్రారంభం కానున్న ‘సమ్మర్ క్యాంప్’ (వేసవి శిక్షణ తరగతులు) గురించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరించారు. విద్యార్థులు తమ సెలవులను వృధా చేసుకోకుండా ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పుస్తక దాత మంజునాథ్‌ను చైర్మన్ దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారులు ఎన్.ఎస్. లావణ్య, ఎ. హరికృష్ణ, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.

గ్రంథాలయానికి 200 పోటీ పరీక్షల పుస్తకాల విరాళం-ఎస్.ఎస్.ఆర్ అకాడమీ ఉదారత