కామారెడ్డి, 24 డిసెంబర్ (పున్నమి ప్రతినిధి ) :
మానసిక ఒత్తిడికి గురై గుర్తుతెలియని గడ్డి మందు తాగి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం చాతర బోయిన శంకర్ మృతి చెందాడు.బుధవారం ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.మన స్థాపాలతో బాధపడుతున్న శంకర్, గుర్తు తెలియని గడ్డి మందు సేవించుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభిం చారు.రామారెడ్డి మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శంకర్ శవాన్ని పోస్ట్మార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)కు తరలించారు. మొదటి నివేదికల ప్రకారం, మానసిక ఒత్తిడి కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.పోలీసులు మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


