Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

గతుకుల రోడ్లతో ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు

Punnami Newsroom Published:
గతుకుల రోడ్లతో ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు

Story highlights

  • ఉదయగిరి రూరల్: ఉదయగిరి, వరికుంటపాడు మండలాల పరిధిలోని పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయి.
  • తారు రోడ్లు దెబ్బతిని అడుగడుగునా గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
  • గండిపాళెం, జీ.కొండారెడ్డిపల్లి, గుడినరవ, ఇస్కపల్లి, మాసాయిపేట తదితర గ్రామాల సమీపంలో రహదారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

ఉదయగిరి రూరల్: ఉదయగిరి, వరికుంటపాడు మండలాల పరిధిలోని పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయి. తారు రోడ్లు దెబ్బతిని అడుగడుగునా గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గండిపాళెం, జీ.కొండారెడ్డిపల్లి, గుడినరవ, ఇస్కపల్లి, మాసాయిపేట తదితర గ్రామాల సమీపంలో రహదారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వర్షాలకు గుంతల్లో నీరు చేరడంతో వాటి లోతు తెలియక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారుతోంది. గతంలో చేపట్టిన మరమ్మతులు నాణ్యత లేకపోవడంతో రోడ్లు త్వరగా దెబ్బతింటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారులకు మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *