Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

బాణసంచా విక్రయ కేంద్రాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు

Punnami Newsroom Published:
బాణసంచా విక్రయ కేంద్రాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు

Story highlights

  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ నెల్లూరు: దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు.
  • శుక్రవారం బాణసంచా విక్రయ కేంద్రాలు, గోదాముల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
  • నెల్లూరు రూరల్ పరిధిలో డీఎస్పీ శ్రీనివాసరావు బాణసంచా గోదాములను పరిశీలించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ

నెల్లూరు: దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం బాణసంచా విక్రయ కేంద్రాలు, గోదాముల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు రూరల్ పరిధిలో డీఎస్పీ శ్రీనివాసరావు బాణసంచా గోదాములను పరిశీలించారు. అగ్నిమాపక పరికరాలు, ఇసుక, నీటి సదుపాయాలు, విద్యుత్ వైరింగ్ భద్రతపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ అజిత వేజండ్ల మాట్లాడుతూ దుకాణదారులు, తయారీదారులు, గోదాముల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు, భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *