విశాఖపట్నం (పున్నమి ప్రతినిధి):
యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా సమాజం అప్రమత్తంగా ఉండాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖ్రబాత్ భాగ్ఛీ పిలుపునిచ్చారు. జనవరి 26వ తేదీన గాజువాక కూడలి నుంచి జింక్ గేట్ వరకు నిర్వహించనున్న మత్తు వ్యసన వ్యతిరేక 2కే రన్ అవగాహన ర్యాలీ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమం మహాత్మ మదర్ థెరీసా ట్రస్ట్ అధ్యక్షుడు జాగరపు శ్రీను ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జాగరపు శ్రీను మాట్లాడుతూ, నేటితరం యువత మత్తు వ్యసనాల నుంచి దూరంగా ఉండేందుకు అవగాహన ర్యాలీలు ఎంతో అవసరమని అన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున జాగరపు శ్రీను ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరంతో పాటు పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ శిబిరంలో కంటి, దంత, చెవి పరీక్షలు, ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, గుండె సంబంధిత ECG పరీక్షలు ఉచితంగా అందించనున్నట్టు పేర్కొన్నారు.
Uploaded Video:




