ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి)
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సత్తుపల్లి, కల్లూరు, వైరా, మధిర, ఎదులాపురం మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు మూలస్తంభమని పేర్కొంటూ ప్రతి అర్హత గల ఓటరు తప్పనిసరిగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.



