T.Ravinder
ఖమ్మం మార్చి16/2026
(పున్నమి ప్రతినిధి)
ఖమ్మం: ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన బీసీ నాయకుడు డా. విశారద మహారాజ్‌ను ఖమ్మం పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు ఆయనను అక్కడి నుంచి తరలించారు.
మొదట ఆయనను మధిర టౌన్ పోలీస్ స్టేషన్‌కు, అనంతరం మధిర రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. అక్కడి నుంచి ఆయనను నందిగామ వైపు పోలీసులు తరలించారు.
ఈ ఘటనకు నిరసనగా మధిర రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద బీసీ నాయకులు పోలీస్ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు.
డా. విశారద మహారాజ్‌ను ఎందుకు అదుపులోకి తీసుకున్నారన్న విషయంపై అధికారిక వివరాలు ఇంకా వెల్లడికాలేదు.


