Story highlights
- Uploaded Video:
కొండయ్యపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పొంగూరు స్వప్న, మురళి గంగిరెడ్డిపల్లి, వెంకట్రావుపల్లి గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ గంప గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. తాము గెలుపొందితే కొండయ్యపాలెం పంచాయతీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని, గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వాములవుతామని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధికి తమకు ఒక అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు.
Uploaded Video: