Story highlights
- Uploaded Video:
బసవరాజుపాలెం పాఠశాల దుస్థితిపై గ్రామస్థుల ఆందోళన.. కుక్కల బెడదతో విద్యార్థుల భద్రతకు ముప్పు
ఆత్మకూరు మండలం బసవరాజుపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దుస్థితిపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు గేటు లేకపోవడంతో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. పాఠశాల ఆవరణ నిర్వహణ లేక అడవిని తలపిస్తుండగా, గదులు బూజుపట్టి, కొన్ని గదులకు కిటికీలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల ప్రాంగణంలోకి కుక్కలు స్వేచ్ఛగా ప్రవేశిస్తుండటంతో విద్యార్థులకు రేబీస్ వంటి వ్యాధుల ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందిస్తారా అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఎంఈఓ, డీఈఓ అధికారులు వెంటనే పాఠశాలను పరిశీలించి గేటు, కిటికీలు ఏర్పాటు చేయడంతో పాటు మరమ్మతులు, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Uploaded Video: