ముస్తాబాద్/పున్నమి ప్రతినిధి జనవరి 20
ఈరోజు ముస్తాబాద్ మండలంలోని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కే.కే. మహేందర్ రెడ్డి గారి స్వగృహంలో ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఆ గ్రామానికి చెందిన పలువురు నాయకులు మరియు యువత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారందరినీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కే.కే. మహేందర్ రెడ్డి గారు సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపై నమ్మకంతోనే తాము కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కొత్తగా చేరిన నాయకులు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం, ప్రజల పక్షాన తీసుకుంటున్న నిర్ణయాలే తమను ఆకర్షించాయని వారు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.



