కళారాధన నంద్యాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సృజనాత్మక సంస్కృతి సమితి సహకారంతో నంద్యాల ఐఎంఏ, లయన్స్ క్లబ్ , సంయుక్త నిర్వహణలో ఈనెల 1వ తేదీ నుండి జరుగుతున్న మాతృభూమికి కళార్చన పోటీలలో ఆదివారం ఆధునిక నృత్యాల పోటీలు, దేశభక్తి బృంద నృత్యాల పోటీలు నిర్వహించారు. కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, జోనల్ చైర్మన్ నిజాముద్దీన్, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్ధన్, కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి రవి ప్రకాష్, నేను నిన్ను వివరించిన శ్రీమన్నారాయణ నటరాజు విగ్రహానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలనతో ఆదివారం నృత్య ఉత్సవాల్ని ప్రారంభించారు.
ప్రత్యేకమైన ఆకర్షణీయమైన రంగురంగుల దుస్తులలో, చక్కటి హావభావాలతో, వేగవంతమైన ఆధునిక సంగీతానికి అనుగుణంగా చేసిన నృత్య విన్యాసాలతో బాలల ప్రతిభ అధిక సంఖ్యలో హాజరైన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఉత్తేజం కలిగించిన దేశభక్తి బృంద నృత్యాలు ఆదివారం సాయంత్రం దేశభక్తి బృంద నృత్యాల పోటీలు నిర్వహించారు. ఉత్తేజ పూరితమైన దేశభక్తి గీతాలకు ప్రదర్శించిన నృత్యాలు తిలకించిన ప్రేక్షకులను ఉద్వేగ భరితం చేసాయి ఉద్వేగ పూరిత ఏకపాత్రాభినయాలు:
బాలలు చత్రపతి శివాజీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, గాంధీ, నెహ్రూ ఏకపాత్రాభినయాలతో ఆహుతుల్ని తమ నటనా చాతుర్యంతో అలరించారు ఈ పోటీలకు విజయవాడకు చెందిన శ్రీమన్నారాయణ న్యాయ నిర్ణేత గా వ్యవహరించారు. ఈ పోటీలను కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కృష్ణ ,కార్యనిర్వాహక కార్యదర్శులు రవి ప్రకాష్, అన్నెం శ్రీనివాసరెడ్డి,రంగనాథ్ కార్యవర్గ సభ్యులు డి.సీ.పీ. శర్మ, వి.వి. శివరామిరెడ్డి లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, నిర్వాహకులు మజీద్,మధు, వెంకటేశ్వర్లు సూర్య ఇస్మాయిల్ పర్యవేక్షించారు సోమ వారం నిర్వహించే పోటీలు: సబ్ జూనియర్, జూనియర్ విభాగాలలో ఉదయం సంస్కృత శ్లోకాల పోటీలు, మధ్యాహ్నం జూనియర్, సీనియర్ విభాగాలలో తెలుగు కవిత గానం పోటీలు నిర్వహిస్తారు

కళారాధన లో ఉత్తేజ భరిత దేశ భక్తి బృంద నృత్యాలు.
కళారాధన నంద్యాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సృజనాత్మక సంస్కృతి సమితి సహకారంతో నంద్యాల ఐఎంఏ, లయన్స్ క్లబ్ , సంయుక్త నిర్వహణలో ఈనెల 1వ తేదీ నుండి జరుగుతున్న మాతృభూమికి కళార్చన పోటీలలో ఆదివారం ఆధునిక నృత్యాల పోటీలు, దేశభక్తి బృంద నృత్యాల పోటీలు నిర్వహించారు. కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, జోనల్ చైర్మన్ నిజాముద్దీన్, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్ధన్, కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి రవి ప్రకాష్, నేను నిన్ను వివరించిన శ్రీమన్నారాయణ నటరాజు విగ్రహానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలనతో ఆదివారం నృత్య ఉత్సవాల్ని ప్రారంభించారు. ప్రత్యేకమైన ఆకర్షణీయమైన రంగురంగుల దుస్తులలో, చక్కటి హావభావాలతో, వేగవంతమైన ఆధునిక సంగీతానికి అనుగుణంగా చేసిన నృత్య విన్యాసాలతో బాలల ప్రతిభ అధిక సంఖ్యలో హాజరైన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఉత్తేజం కలిగించిన దేశభక్తి బృంద నృత్యాలు ఆదివారం సాయంత్రం దేశభక్తి బృంద నృత్యాల పోటీలు నిర్వహించారు. ఉత్తేజ పూరితమైన దేశభక్తి గీతాలకు ప్రదర్శించిన నృత్యాలు తిలకించిన ప్రేక్షకులను ఉద్వేగ భరితం చేసాయి ఉద్వేగ పూరిత ఏకపాత్రాభినయాలు: బాలలు చత్రపతి శివాజీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, గాంధీ, నెహ్రూ ఏకపాత్రాభినయాలతో ఆహుతుల్ని తమ నటనా చాతుర్యంతో అలరించారు ఈ పోటీలకు విజయవాడకు చెందిన శ్రీమన్నారాయణ న్యాయ నిర్ణేత గా వ్యవహరించారు. ఈ పోటీలను కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కృష్ణ ,కార్యనిర్వాహక కార్యదర్శులు రవి ప్రకాష్, అన్నెం శ్రీనివాసరెడ్డి,రంగనాథ్ కార్యవర్గ సభ్యులు డి.సీ.పీ. శర్మ, వి.వి. శివరామిరెడ్డి లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, నిర్వాహకులు మజీద్,మధు, వెంకటేశ్వర్లు సూర్య ఇస్మాయిల్ పర్యవేక్షించారు సోమ వారం నిర్వహించే పోటీలు: సబ్ జూనియర్, జూనియర్ విభాగాలలో ఉదయం సంస్కృత శ్లోకాల పోటీలు, మధ్యాహ్నం జూనియర్, సీనియర్ విభాగాలలో తెలుగు కవిత గానం పోటీలు నిర్వహిస్తారు

