పున్నమి న్యూస్, పెద్దాపురం 26/10
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా పెద్దాపురం మండలంలోని ఏలేరు ప్రాజెక్టు పరిధిలోని గ్రామాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై వి మౌనిక పేర్కొన్నారు. ముఖ్యంగా ఏలేరు ప్రాజెక్టు పరిధిలోని కాలువలు ఆనుకొని నివాస ఉంటున్న ప్రజలు సురక్షిత మైన ప్రాంతాల్లో నివాసం ఉండేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. కాలవల్లో కానీ, కాలువ అంచున చిన్నారులు యువకులు మహిళలు వెళ్ళకుండ జాగ్రత్తలు పాటించాలన్నారు


