Monday, 23 March 2026
  • Home  
  • ఆధార్ అప్డేట్‌కు 150 రూపాయలు వసూలు – ప్రభుత్వ ఆధార్ సెంటర్‌లో అక్రమ వసూళ్లు
- ఎన్ టి ఆర్ జిల్లా

ఆధార్ అప్డేట్‌కు 150 రూపాయలు వసూలు – ప్రభుత్వ ఆధార్ సెంటర్‌లో అక్రమ వసూళ్లు

జగ్గయ్యపేట మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఆధార్ కార్డు సెంటర్ లో సర్వసాధారణ ప్రజలను దోచుకునే విధంగా అక్రమంగా వసూళ్లు జరుగుతు న్నాయన్న ఆరోపణలు వెల్లడి చేస్తున్నాయి. ఆధార్ కార్డ్ అప్డేట్‌కు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు భిన్నంగా, ₹150 వరకు వసూలు చేస్తూ, ఎలాంటి రిసిప్ట్ ఇవ్వకుండా, విధిగా డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ ప్రజలను వేధిస్తున్న తీరుపై మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి సిబ్బంది, అప్డేట్ కోసం వచ్చిన వారిని 2-3 గంటలపాటు వేచి ఉండాలని చెబుతూ, ప్రశ్నించిన వారిని “ఉండు లేకపోతేవెళ్ళిపో” అంటూ బెదిరిస్తున్న తీరుపై ప్రజల్లో తీవ్ర ఆవేదన నెలకొంది. మరింత ఆశ్చర్యకరం ఏంటంటే, ఏ సేవకు ఎంత చార్జ్ అని పేర్కొనబడిన బోర్డు కూడా అక్కడ కనబడడం లేదు. కూలీలుగా పనిచేసేవారు, చిన్న చిన్న వ్యాపారులు, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విధంగా వేధింపులకు గురవు తుండగా, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ప్రశ్నార్థకంగా మారింది. MRO ను ఫోన్‌లో సంప్రదించగా స్పందించకపోగా, RDO ను కలిసిన తర్వాత సంబంధిత అధికారులను పంపించి విచారణ చేపడతానని హామీ ఇవ్వడం కొంత ఊరటనిస్తోంది. ప్రజలు డిమాండ్ చేస్తున్నారు – ఇలాంటి అక్రమ కేంద్రాలను వెంటనే మూసివేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకో వాలని. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగే ఈ దోపిడీకి సంబంధించి అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడం బాధాకరం. ప్రజలకు విజ్ఞప్తి: ఎవరైనా ఆధార్ అప్డేట్ కేంద్రం లో అక్రమ వసూళ్లకు గురైతే, UIDAI అధికారిక వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్ (1947) ద్వారా ఫిర్యాదు చేయాలి. తీసుకునే డబ్బులకు రిసిప్ట్ ఇవ్వకపోతే, అది స్పష్టమైన నిబంధనల ఉల్లంఘన.

జగ్గయ్యపేట మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఆధార్ కార్డు సెంటర్ లో సర్వసాధారణ ప్రజలను దోచుకునే విధంగా అక్రమంగా వసూళ్లు జరుగుతు న్నాయన్న ఆరోపణలు వెల్లడి చేస్తున్నాయి. ఆధార్ కార్డ్ అప్డేట్‌కు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు భిన్నంగా, ₹150 వరకు వసూలు చేస్తూ, ఎలాంటి రిసిప్ట్ ఇవ్వకుండా, విధిగా డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ ప్రజలను వేధిస్తున్న తీరుపై మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి సిబ్బంది, అప్డేట్ కోసం వచ్చిన వారిని 2-3 గంటలపాటు వేచి ఉండాలని చెబుతూ, ప్రశ్నించిన వారిని “ఉండు లేకపోతేవెళ్ళిపో” అంటూ బెదిరిస్తున్న తీరుపై ప్రజల్లో తీవ్ర ఆవేదన నెలకొంది. మరింత ఆశ్చర్యకరం ఏంటంటే, ఏ సేవకు ఎంత చార్జ్ అని పేర్కొనబడిన బోర్డు కూడా అక్కడ కనబడడం లేదు.
కూలీలుగా పనిచేసేవారు, చిన్న చిన్న వ్యాపారులు, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విధంగా వేధింపులకు గురవు తుండగా, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ప్రశ్నార్థకంగా మారింది. MRO ను ఫోన్‌లో సంప్రదించగా స్పందించకపోగా, RDO ను కలిసిన తర్వాత సంబంధిత అధికారులను పంపించి విచారణ చేపడతానని హామీ ఇవ్వడం కొంత ఊరటనిస్తోంది.
ప్రజలు డిమాండ్ చేస్తున్నారు – ఇలాంటి అక్రమ కేంద్రాలను వెంటనే మూసివేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకో వాలని. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగే ఈ దోపిడీకి సంబంధించి అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడం బాధాకరం.

ప్రజలకు విజ్ఞప్తి:
ఎవరైనా ఆధార్ అప్డేట్ కేంద్రం లో అక్రమ వసూళ్లకు గురైతే, UIDAI అధికారిక వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్ (1947) ద్వారా ఫిర్యాదు చేయాలి. తీసుకునే డబ్బులకు రిసిప్ట్ ఇవ్వకపోతే, అది స్పష్టమైన నిబంధనల ఉల్లంఘన.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.