ఆత్మకూరు నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ బలోపేతానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. బండ్లపల్లి గ్రామానికి చెందిన కలువాయి లక్ష్మిని ఆత్మకూరు నియోజకవర్గ మహిళ కన్వీనర్‌గా నియమించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర మహిళ కన్వీనర్ కాకుటూరు పుష్పాంజలి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కలువాయి లక్ష్మి బీఎస్పీ పార్టీలో చేరారు. కార్యక్రమంలో నెల్లూరు జిల్లా బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పుష్పాంజలి గారు సూచించగా, బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని లక్ష్మి హామీ ఇచ్చారు. స్థానిక నాయకులు ఆమె నియామకాన్ని స్వాగతించారు.



