పున్నమి ప్రతినిధి:
అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్ ఇవ్వాలి*
*గ్రేటర్ పరిధిలోని మండలాల్లో అక్రిడిటేషన్ల సంఖ్య పెంచాలి*
*ఐ అండ్ పి ఆర్ కమిషనర్ కు విజ్ఞప్తి చేసిన టీ యూ డబ్ల్యూ జే (ఐ జే యూ) బృందం*
గ్రేటర్ హైదరాబాద్ పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు వచ్చే విధంగా జీవోలో సవరింపులు చేపట్టాలని కోరుతూ టీ యూ డబ్ల్యూ జే (ఐజేయూ) బృందం సమాచార శాఖ కమిషనర్ కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం సచివాలయం లోని ఐ అండ్ పిఆర్ కార్యాలయంలో ప్రత్యేక కమిషనర్ ప్రియాంకను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా టీయుడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి కే శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేష్, హెచ్ యు జె అధ్యక్షులు శిగా శంకర్, మేడ్చల్ అధ్యక్షులు గడ్డమీది బాలరాజు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎండీ సలీమ్ పాషా, మేడ్చల్ కార్యదర్శి వెంకట్ రాం రెడ్డి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మేకల సత్యనారాయణలు సమస్యను ఆమెకు వివరించారు. గ్రేటర్ పరిధిలోని అర్బన్ మండలాలలో ప్రధాన పత్రికలలో నలుగురు నుంచి ఐదుగురు జర్నలిస్టులు విధులు నిర్వహిస్తున్నారని ఆమెకు తెలిపారు. నూతన జీవో 252 ద్వారా ఒక పత్రికకు మండలానికి ఒకే అక్రిడిటేషన్ పొందే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన ముగ్గురు నలుగురికి అక్రిడిటేషన్ అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. రూరల్ మండలాలతో కాకుండా అర్బన్ మండలాలను ప్రత్యేకంగా చూడాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల ఆవేదనలు దృష్టిలో ఉంచుకొని జీవోలో సవరణలు చేసి న్యాయం చేయాలని కోరారు.
*సానుకూలంగా స్పందించిన కమిషనర్*
గ్రేటర్ పరిధిలోని మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్య పై పౌర సంబంధాలు అండ్ సమాచార శాఖ కమిషనర్ ప్రియాంక సానుకూలంగా స్పందించారు. అర్బన్ మండలాలలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ లు ఇవ్వడం న్యాయ బద్ధమైనదని తెలిపారు. త్వరలోనే మంత్రితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీని ఇచ్చారు.

*అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్ ఇవ్వాలి గ్రేటర్ పరిధిలోని మండలాల్లో అక్రిడిటేషన్ల సంఖ్య పెంచాలి
పున్నమి ప్రతినిధి: అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్ ఇవ్వాలి* *గ్రేటర్ పరిధిలోని మండలాల్లో అక్రిడిటేషన్ల సంఖ్య పెంచాలి* *ఐ అండ్ పి ఆర్ కమిషనర్ కు విజ్ఞప్తి చేసిన టీ యూ డబ్ల్యూ జే (ఐ జే యూ) బృందం* గ్రేటర్ హైదరాబాద్ పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు వచ్చే విధంగా జీవోలో సవరింపులు చేపట్టాలని కోరుతూ టీ యూ డబ్ల్యూ జే (ఐజేయూ) బృందం సమాచార శాఖ కమిషనర్ కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం సచివాలయం లోని ఐ అండ్ పిఆర్ కార్యాలయంలో ప్రత్యేక కమిషనర్ ప్రియాంకను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా టీయుడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి కే శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేష్, హెచ్ యు జె అధ్యక్షులు శిగా శంకర్, మేడ్చల్ అధ్యక్షులు గడ్డమీది బాలరాజు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎండీ సలీమ్ పాషా, మేడ్చల్ కార్యదర్శి వెంకట్ రాం రెడ్డి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మేకల సత్యనారాయణలు సమస్యను ఆమెకు వివరించారు. గ్రేటర్ పరిధిలోని అర్బన్ మండలాలలో ప్రధాన పత్రికలలో నలుగురు నుంచి ఐదుగురు జర్నలిస్టులు విధులు నిర్వహిస్తున్నారని ఆమెకు తెలిపారు. నూతన జీవో 252 ద్వారా ఒక పత్రికకు మండలానికి ఒకే అక్రిడిటేషన్ పొందే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన ముగ్గురు నలుగురికి అక్రిడిటేషన్ అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. రూరల్ మండలాలతో కాకుండా అర్బన్ మండలాలను ప్రత్యేకంగా చూడాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల ఆవేదనలు దృష్టిలో ఉంచుకొని జీవోలో సవరణలు చేసి న్యాయం చేయాలని కోరారు. *సానుకూలంగా స్పందించిన కమిషనర్* గ్రేటర్ పరిధిలోని మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్య పై పౌర సంబంధాలు అండ్ సమాచార శాఖ కమిషనర్ ప్రియాంక సానుకూలంగా స్పందించారు. అర్బన్ మండలాలలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ లు ఇవ్వడం న్యాయ బద్ధమైనదని తెలిపారు. త్వరలోనే మంత్రితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీని ఇచ్చారు.

