శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 10: అమృతం కోసం దేవ, దానవులు క్షీరసాగర మధన సంఘటన ఆధారంగా మహా శివరాత్రి బ్రహ్మోత్సావాలకు అకురం ఏర్పడిందని పురాణలు ద్వార తెలుస్తుంది. పాలసముద్ర మధన సమయంలో లక్ష్మిదేవి ఉద్భవించిన ఆమేను శ్రీమహావిష్ణువు వివాహమాడతాడు. కామధేనువుని, ఐరావతాన్ని దేవతాధిపతి దేవేంద్రుడు తీసుకుంటాడు. అమృతం రావటానికి మంరింత సమయం కావడంతో దేవతలు, రాక్షసులు అత్యంత శక్తితో పాలసముద్రాన్ని చిలకగా కాలకూట విషం (హలహలం) ఉద్భవించింది. దీనిని స్వీకరించాడానికి దేవతలలోగాని, రాక్షసులలోగాని ఎవ్వరు ముందుకు రాకపోవడంతో మహాదేవుడు ఆ విషాన్ని తన త్రాగి తన కంఠస్థానంలో నిపుపుకుంటాడు అంద తనే ఆయనకు గరళకంఠుడనే పేరువచ్చింది. విషప్రభాంతో పరమశివుడు మగత నిద్రలోనికి జారుకుంటాడు. పడుకుంటే విషప్రభావం అధికమౌ తుభావించిన దేవత, రాక్షసులు, మునులు, యక్ష, కిన్నేర్లు, గందర్వులు, అందరు కలసి జాగరణ చేస్తారు. ఈ విధానాన్నే మహాశివరాత్రి బ్రహో్మూ త్సావాల అంకురం ఏర్పదని పూర్వికులు చేబుతారు.
తొలి పూజ భక్తునికే…
మూడ భక్తితో కొలిచిన బోయవాడైన కణ్ణడికి మహేశ్వరుడు మోక్షాన్ని ఇవ్వగా అతడు భక్తకన్నప్పగా ప్రసిద్ధిగాంచాడు. దీంతో తొలిరోజు గురువారం భక్తకన్నప్ప ధ్వజారోహణంతో ఉత్సవాలు మొదలౌతాయి.
రెండవ రోజు దేవరాత్రి…..
పరమేశ్వరుని మేలుకోలుపుతూ దేవతలు నిర్వహించడమే దేవరాత్రి. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శుక్రవారం స్వామివారి ధ్వజారోహణం జర గుతుంది. స్వామివారి ఆలయ సన్నిధిలోని ధ్వజస్థంభం వద్ద స్వామి, అమ్మవార్ల, ఉత్సవమూర్తులతో పాటు, గణపతి, కూమరస్వామి, భక్తకన్నప్ప, చండికేశ్వరస్వామి లను నాలుగు ప్రక్కల ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. శ్రీస్వామి, అమ్మవార్లను అంబారీలపై ఊరేగిస్తారు.
మూడవ రోజు భూతరాత్రి…
ఈ కార్యక్రమాన్ని శనివారం భూత, ప్రమథగణాదుల ఆడుతూ, పాడుతు నిర్వహించే కార్యక్రమంల కావడంతో ఈ రాత్రిని భూత రాత్రి ఆ ని పిలుస్తారు. ఉదయం సూర్య ప్రభవాహనం పై, రాత్రి భూత- శుక వాహనాల పై స్వామి, అమ్మవార్ల ఊరేగుతారు. హరిజన సేవాసంఘ ఆధ్వర్య Oలో ఈ కార్యన్ని చేస్తారు.
నాలుగో రోజు గంధర్వరాత్రి….
సామిని మేలుకొలుపుతూ నాలుగోరోజు గంధర్వులు వివిధ రకాల విన్యాసాలను ప్రదర్శిస్తారు. స్వామివారిని అనేవ రకాలుగా కీర్తిస్తారు. ఉదయం స్వామి, అమ్మవార్లను రాత్రి రావణ- మయురి వాహనాలపై పురవీధులయందు సంచరించి భక్తులను కటాక్షిస్తారు.
ఐదవ రోజు నాగరాత్రి….
ఐదో రోజు నాగులు నాట్యమాడి పరమేశ్వరుని నిద్రలోకి జారనివ్వకుండా ప్రయత్నం చేస్తాయి. స్వామి, అమ్మవార్లను హంస-యాళి వాహనలపై ఉరేగిస్తారు.
అరవ రోజు మహాశివరాత్రి….
ఆరోరోజు దేవ, దానవులు, గంధర్వులు, ఋషులు, కిన్నేర, కింపురుషులు కలిసి జాగరణ చేస్తారు. ఈ రాత్రినే మహాశివరాత్రి అంటారు. ఆరోజు ఉదయం నుండి రాత్రి వరకు 10 అభిషేకాలు నిర్వహిస్తారు. ఉదయం ఇంద్రవిమాన వాహనం, రాత్రి నంది, సింహ వాహనాలపై ఊరేగింపు చేపడతారు. ఇక 11వ అభిషేకానికి పరమశివుడు మగత నిద్రనుండు మేల్కోంటాడు. దీనినే లింగోధ్భవ దర్శనం అంటారు.
ఏడవ రోజు బ్రహ్మారాత్రి….
భూమిని రథంగా చేసుకుని, సూర్య, చంద్రులను చక్రాలుగా బ్రహ్మాసారథిగా నిర్వహించేదే ఈ రథోత్సవం ఆ రోజు అమ్మవారికి కూడ రథో త్సవం కార్యక్రమాన్ని చేపడతారు. అదే రోజు రాత్రి నారద పుష్కరిణినందు తెప్పొత్సవాన్ని నిర్వహిస్తారు.
ఎనిమిదవ రోజు స్కందరాత్రి
పరమేశ్వరుని కుమారుడు సుబ్రమణ్య స్వామి, చేపట్టే శ్రీస్వామి, అమ్మవార్ల వివాహాన్నే స్కందరాత్రి అని అంటారు. ఈ రోజు స్వామివారిని గజవాహనంపై అమ్మవారిని సింహవాహనంపై చతుర్మద వీధులయందు ఊరేగిస్తారు.
తొమ్మిదవ రోజు దేవరాత్రి….
ఈ ఉత్సవంలో భాగంగా ఆలయంలోని శివకామిని సుందరి సమేత నటరాజస్వామికి ఆలయ ప్రాగణంలో వివాహన్ని జరుపుతారు.
పదవ రోజు ఋషిరాత్రి
పరమశివుని మేల్కొలపడానికి విచ్చేసిన ఋషులను తిరిగి వారి నివాసాలకు చేర్చే ఉత్సవాన్ని గిరి ప్రదక్షణ, కొడచుట్టు, ఋషిరాత్రి గాను పిలుస్తారు. అనంతరం రాత్రి స్వామి వారు అశ్వవాహనంపై, అమ్మవారు సింహవాహనం పై నాలుగు వీధులయందు విహరిస్తారు.
పదకుండవ రోజు దేవరాత్రి.
మహాశివరాత్రి బ్రహ్మోత్సావాలలో రెండవ రోజును దేవరాత్రిగా పిలుస్తారు. దీంతో 11వ రోజును దేవరాత్రిగా పిలుస్తారు. ఆదివారం కే డిగం మీద రాత్రి సింహ-కామధేను వాహనాలపై స్వామి, అమ్మవార్లను ఊరేగింపు ఉంటుంది.
పన్నేండవ రోజు పల్లకీ సేవ…
పరమేశ్వరునితోపాటు పార్వతిదేవి, గంగాదేవిని వేడుకగా పురవీధులయందు పల్లకీలో ఊరేగిస్తారు.
పదమూడవరోజు ఏకాంత సేవా బ్రహ్మోత్సవాలు ఏకాంత సేవతో ముగుస్తాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సావాలు జరిగే 12 రోజు ఏకాంత సేవను నిర్వహించరు. ఉత్స వాలు ముగిసిన తరువాత ఏకాంత సేవను నిర్వహి స్తారు.


