Thursday, 12 February 2026
  • Home  
  • అక్కంపేటలో ఉపాధి హామీ యాత్రకు షర్మిల ఊపిరి – హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అక్కంపేటలో ఉపాధి హామీ యాత్రకు షర్మిల ఊపిరి – హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి ( పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల నిర్వహించిన ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్రలో ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చి పేదవాడికి పని గ్యారంటీ కల్పించిందని ఆమె గుర్తు చేశారు. రాజన్న పాలనలో పనివద్ద టెంట్లు, మంచినీళ్లు, మజ్జిగ వంటి సౌకర్యాలు ఉండేవని, మహిళలకు పురుషులతో సమాన వేతనం అందించి ఆదుకున్నారని కొనియాడారు. కానీ నేడు బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని, పేరు మార్చి కొత్త చట్టం తెచ్చి కూలీలను కాంట్రాక్టర్ల ఆధీనంలోకి నెట్టాలని చూస్తోందని ఆమె మండిపడ్డారు. పేదల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని షర్మిల స్పష్టం చేశారు. ఈ సభను ఉద్దేశించి డిసిసి అధ్యక్షుడు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి ( పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల నిర్వహించిన ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్రలో ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చి పేదవాడికి పని గ్యారంటీ కల్పించిందని ఆమె గుర్తు చేశారు. రాజన్న పాలనలో పనివద్ద టెంట్లు, మంచినీళ్లు, మజ్జిగ వంటి సౌకర్యాలు ఉండేవని, మహిళలకు పురుషులతో సమాన వేతనం అందించి ఆదుకున్నారని కొనియాడారు.
కానీ నేడు బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని, పేరు మార్చి కొత్త చట్టం తెచ్చి కూలీలను కాంట్రాక్టర్ల ఆధీనంలోకి నెట్టాలని చూస్తోందని ఆమె మండిపడ్డారు. పేదల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని షర్మిల స్పష్టం చేశారు.
ఈ సభను ఉద్దేశించి డిసిసి అధ్యక్షుడు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.