నందిగామ, బుధవారం అండర్-14 రాష్ట్ర స్థాయి సెలక్షన్‌కు ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టులో ఎంపికైన లింగాలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి మంద మహిను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తమ కార్యాలయంలో మర్యాదపూర్వ కంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మహికి శాలువా కప్పి ఘనంగా సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ, “గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచడం గర్వకారణం. మహి వంటి యువ క్రీడాకారులు భవిష్యత్తు లో రాష్ట్రానికి పేరు తెచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు డి.లక్ష్మి, ప్రధానోపాధ్యాయుడు రాంబాబు, ఉపాధ్యాయులు జి. సరిత, వి.శ్రీనివాసరావు, ఎన్. శ్రీహరి, ఎస్ఎంసి చైర్మన్ షేక్ నాగుల్ మేరా తదితరులు పాల్గొన్నారు. వారు మహికి అభినందనలు తెలియజేస్తూ, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

అండర్-14 రాష్ట్ర సెలక్షన్‌కు ఎంపికైన మంద మహికి ఘన సత్కారం
నందిగామ, బుధవారం అండర్-14 రాష్ట్ర స్థాయి సెలక్షన్‌కు ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టులో ఎంపికైన లింగాలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి మంద మహిను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తమ కార్యాలయంలో మర్యాదపూర్వ కంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మహికి శాలువా కప్పి ఘనంగా సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ, “గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచడం గర్వకారణం. మహి వంటి యువ క్రీడాకారులు భవిష్యత్తు లో రాష్ట్రానికి పేరు తెచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు డి.లక్ష్మి, ప్రధానోపాధ్యాయుడు రాంబాబు, ఉపాధ్యాయులు జి. సరిత, వి.శ్రీనివాసరావు, ఎన్. శ్రీహరి, ఎస్ఎంసి చైర్మన్ షేక్ నాగుల్ మేరా తదితరులు పాల్గొన్నారు. వారు మహికి అభినందనలు తెలియజేస్తూ, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

