కలిగిరి అక్టోబర్ 23న
వీర్నకొల్లు గ్రామానికి చెందిన లెక్కల రమణమూర్తి – శ్రీమతి విజయలక్ష్మి దంపతుల కుమారుడు జస్వంత్ గంధపు నలుగు కార్యక్రమం ఘనంగా ఆనందభరిత వాతావరణంలో సంతోషంగా, సాంప్రదాయ బద్ధంగా జరిగింది. ఈ గంధపు నలుగు వేడుకలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు హాజరై, వరుడు జస్వంత్‌ను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఆయన జస్వంత్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, జీవితంలో అన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే, లెక్కల వారి కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా కొంత సమయం ముచ్చటించి, వారి సంతోషాన్ని పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, బంధుమిత్రులు, ఆత్మీయులు పాల్గొని వరుడును ఆశీర్వదించారు.


