కామారెడ్డి పున్నమి ప్రతినిధి ఆగస్టు 29
కామారెడ్డి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నందున, రైలు, బస్సు సౌకర్యం ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జి.ఆర్ కాలనీలో ఇండ్లు నీట మునిగాయి. వరద ఉధృతికీ దాదాపు 10 కార్లు వరదలో కొట్టుకుపోయాయి. చరిత్రలో ఇలాంటి వానను ఎప్పుడూ చూళ్ళేదు అని కామారెడ్డి జిల్లా వాసులు తెలిపారు. కుంటలు, చెరువులు, పొంగిపోయాయి. రోడ్లు దాదాపుగా అంతటా పాడినాయి. కామారెడ్డికి రాకపోకలు నిలిపోయాయి. అన్ని రకాల వసతులు కోల్పోయిన వారికి కామారెడ్డి RSS స్వయం సేవకులు సకాలంలో స్పందించి ఐదారు బృందాలుగా ఏర్పడి రిస్క్ టీంకు సహకరించి ఎందరినో నీటి నుండి సురక్షితంగా రక్షించారు. బాధితులకు పండ్లు, ఆహారం అందించారు. జాతీయ రోడ్ పై వేళ్ళు వాహన దాడులకు ఆహారం నీరు అందించి మానవతను చాటారు.


