నాగర్ కర్నూల్ ప్రతినిధి అక్టోబర్ 23, ( పున్నమి ) :
హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో డాక్టర్ బైక్ ఢీకొట్టిన సంఘటనలో ఇరువురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని తమ్మలోని గూడెం గేటు సమీపంలో గురువారం చోటుచేసుకుంది
యాచారం మండలం ఎస్సై మధు తెలిపిన వివరాలు ప్రకారం కడ్తాల్ మండలం ముద్వేల్ గ్రామానికి చెందిన తలతి అభిరామ్ ఆర్తి (9,)అబిరం (5) సంవత్సరాలు గల ఇద్దరు చిన్నారులు తన తండ్రి ద్విచక్ర వాహనంపై మాలువైపు వెళుతున్నారు ఈ క్రమంలో ద్విచక్ర వాహనాన్ని తమలోని గేటు సమీపంలో ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది దీంతో ఇద్దరు చిన్నారులకు బలంగా గాయాలయి అక్కడికక్కడే మృతి చెందారు యాచారం మండల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చిన్నారుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడంతో ఆ చిన్నారుల తల్లిదండ్రుల రోదనలు చెప్పలేని కానివి దీంతో ముద్విన్ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి


