అలంపూర్ : ఆగస్టు 14 ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ పట్టణ కేంద్రంలో జాతీయ జెండాల వితరణ చేసిన బిజెపి నేతలు.
బీజేపీ అలంపూర్ మండల మరియు పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు అలంపూర్ పట్టణ అధ్యక్షులు శరత్, మండల అధ్యక్షులు ఈశ్వర్ కలిసి, జాతీయ జెండాల వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ…స్వాతంత్ర్య దినోత్సవం (15 ఆగస్టు) సందర్భంగా, భారతదేశ గౌరవానికి ప్రతీక అయిన త్రివర్ణ పతాకం ప్రతి ఇంటి వద్ద ఎగరడం లక్ష్యంగా, జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ పట్టణ కేంద్రంలో జాతీయ జెండాల పంపిణీ చేపట్టాం అన్నారు. దేశభక్తి, ఐక్యత భావనను ప్రజల్లో మరింత పెరగాలన్నారు.
“హర్ ఘర్ తిరంగా” పిలుపును విస్తరించడం
యువత, మహిళలు ,రైతులు, కార్మికులకు జాతీయ పతాకం ప్రాముఖ్యతను తెలియజేశారు.
“జాతీయ పతాకం మన గర్వం. ఇది మన స్వేచ్ఛ, త్యాగం, ఐక్యతకు ప్రతీక. ప్రతి ఇంటి వద్ద ఈ జెండా ఎగరడం ద్వారా దేశభక్తి తరతరాలకు చేరుతుంది” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్, రాష్ట్ర ఓబిసి మోర్చా ప్రోగ్రామ్ కన్వీనర్ జంగం నాగమల్లయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి నరేష్, పట్టణ ఉపాధ్యక్షుడు మద్దిలేటి, పట్టణ మాజీ అధ్యక్షుడు వినీత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

” హర్ ఘర్ తిరంగ్ ” కార్యక్రమంలో భాగంగా… జాతీయ జెండా వితరణ చేసిన బిజెపి నేతలు.
అలంపూర్ : ఆగస్టు 14 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ పట్టణ కేంద్రంలో జాతీయ జెండాల వితరణ చేసిన బిజెపి నేతలు. బీజేపీ అలంపూర్ మండల మరియు పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు అలంపూర్ పట్టణ అధ్యక్షులు శరత్, మండల అధ్యక్షులు ఈశ్వర్ కలిసి, జాతీయ జెండాల వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ…స్వాతంత్ర్య దినోత్సవం (15 ఆగస్టు) సందర్భంగా, భారతదేశ గౌరవానికి ప్రతీక అయిన త్రివర్ణ పతాకం ప్రతి ఇంటి వద్ద ఎగరడం లక్ష్యంగా, జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ పట్టణ కేంద్రంలో జాతీయ జెండాల పంపిణీ చేపట్టాం అన్నారు. దేశభక్తి, ఐక్యత భావనను ప్రజల్లో మరింత పెరగాలన్నారు. “హర్ ఘర్ తిరంగా” పిలుపును విస్తరించడం యువత, మహిళలు ,రైతులు, కార్మికులకు జాతీయ పతాకం ప్రాముఖ్యతను తెలియజేశారు. “జాతీయ పతాకం మన గర్వం. ఇది మన స్వేచ్ఛ, త్యాగం, ఐక్యతకు ప్రతీక. ప్రతి ఇంటి వద్ద ఈ జెండా ఎగరడం ద్వారా దేశభక్తి తరతరాలకు చేరుతుంది” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్, రాష్ట్ర ఓబిసి మోర్చా ప్రోగ్రామ్ కన్వీనర్ జంగం నాగమల్లయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి నరేష్, పట్టణ ఉపాధ్యక్షుడు మద్దిలేటి, పట్టణ మాజీ అధ్యక్షుడు వినీత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

