హద్గాంలో పంటలు నీటమునిగి నష్టం
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని హద్గాం గ్రామ శివారులో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు బైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో సోయా, పత్తి, వరి పంటలు నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లాయి. రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏవో గిరిరాజ్, ఏఈఓ సంగీత రైతులతో కలిసి పంటలను పరిశీలించి, నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ పరిశీలనలో వికాస్ పటేల్, ప్రకాష్ పటేల్, విజయ్, సంజీవ్, ప్రవీణ్, భోజన్న, సంతు, ఇంద్రకాంత్ పటేల్, ప్రశాంత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.


