Thursday, 12 February 2026
  • Home  
  • స్పీడ్‌గా మారుతున్న ‘స్పీడ్ పోస్టు’ – కొత్త రేట్లు, కొత్త టెక్నాలజీ!
- ఆంధ్రప్రదేశ్

స్పీడ్‌గా మారుతున్న ‘స్పీడ్ పోస్టు’ – కొత్త రేట్లు, కొత్త టెక్నాలజీ!

విశాఖపట్నం అక్టోబర్ 05 భారత పోస్టల్ శాఖ తన సర్వీసుల్లో భారీ అప్‌డేట్‌కి శ్రీకారం చుట్టింది. పాత పోస్టాఫీస్ ఇమేజ్ని తుడిచేస్తూ, ఆధునిక డిజిటల్ యుగానికి తగ్గట్టు స్పీడ్ పోస్టు సేవను పూర్తిగా రీడిజైన్ చేసింది. 🗓️ అక్టోబర్ 1, 2025 నుండి దేశవ్యాప్తంగా కొత్త రేట్లు, కొత్త ఫీచర్లు అమల్లోకి వస్తాయి.ఇప్పుడు పోస్టు వస్తే కేవలం ట్రాకింగ్ నంబర్ కాదు — మీ ఫోన్‌లోనే OTP ద్వారా సురక్షిత డెలివరీ కన్ఫర్మ్ అవుతుంది. ప్రతి స్టేజ్‌లో SMS అలర్ట్స్ వస్తాయి, మీరు పంపిన లేఖ లేదా పార్సిల్ ఎక్కడుందో “రియల్ టైమ్ ట్రాకింగ్” ద్వారా చెక్ చేసుకోవచ్చు. స్థానికంగా 50 గ్రాముల వరకు పంపేందుకు ₹19 నుంచి ప్రారంభం. రిజిస్టర్డ్ పోస్ట్ ఇక స్పీడ్ పోస్ట్ లోనేపోస్టల్ శాఖ రిజిస్టర్డ్ పోస్టు సేవను రద్దు చేయలేదని స్పష్టంచేసింది — దాన్ని స్పీడ్ పోస్టు వ్యవస్థలో విలీనం చేసి, మరింత వేగంగా, సురక్షితంగా, ట్రాకింగ్ సౌకర్యంతో అందుబాటులోకి తెస్తోంది. ఏపీకి సిస్టమ్ ( అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ)డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ భాగంగా, దేశవ్యాప్తంగా 1.6 లక్షల పోస్టాఫీసుల్లో కొత్త సాంకేతిక వేదిక – ఏ పి టి సిస్టమ్ అమలవుతోంది. దీని వల్ల బుకింగ్, డెలివరీ, ట్రాకింగ్, డేటా మేనేజ్‌మెంట్ అన్నీ ఒకే సిస్టమ్‌లో నిర్వహించబడతాయి.“ప్రజలకు మరింత వేగవంతమైన, సురక్షితమైన, పారదర్శకమైన సేవలు అందించడమే మా లక్ష్యం.”

విశాఖపట్నం అక్టోబర్ 05

భారత పోస్టల్ శాఖ తన సర్వీసుల్లో భారీ అప్‌డేట్‌కి శ్రీకారం చుట్టింది. పాత పోస్టాఫీస్ ఇమేజ్ని తుడిచేస్తూ, ఆధునిక డిజిటల్ యుగానికి తగ్గట్టు స్పీడ్ పోస్టు సేవను పూర్తిగా రీడిజైన్ చేసింది.

🗓️ అక్టోబర్ 1, 2025 నుండి దేశవ్యాప్తంగా కొత్త రేట్లు, కొత్త ఫీచర్లు అమల్లోకి వస్తాయి.
ఇప్పుడు పోస్టు వస్తే కేవలం ట్రాకింగ్ నంబర్ కాదు — మీ ఫోన్‌లోనే OTP ద్వారా సురక్షిత డెలివరీ కన్ఫర్మ్ అవుతుంది. ప్రతి స్టేజ్‌లో SMS అలర్ట్స్ వస్తాయి, మీరు పంపిన లేఖ లేదా పార్సిల్ ఎక్కడుందో “రియల్ టైమ్ ట్రాకింగ్” ద్వారా చెక్ చేసుకోవచ్చు.

స్థానికంగా 50 గ్రాముల వరకు పంపేందుకు ₹19 నుంచి ప్రారంభం.

రిజిస్టర్డ్ పోస్ట్ ఇక స్పీడ్ పోస్ట్ లోనే
పోస్టల్ శాఖ రిజిస్టర్డ్ పోస్టు సేవను రద్దు చేయలేదని స్పష్టంచేసింది — దాన్ని స్పీడ్ పోస్టు వ్యవస్థలో విలీనం చేసి, మరింత వేగంగా, సురక్షితంగా, ట్రాకింగ్ సౌకర్యంతో అందుబాటులోకి తెస్తోంది.

ఏపీకి సిస్టమ్ ( అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ)
డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ భాగంగా, దేశవ్యాప్తంగా 1.6 లక్షల పోస్టాఫీసుల్లో కొత్త సాంకేతిక వేదిక – ఏ పి టి సిస్టమ్ అమలవుతోంది. దీని వల్ల బుకింగ్, డెలివరీ, ట్రాకింగ్, డేటా మేనేజ్‌మెంట్ అన్నీ ఒకే సిస్టమ్‌లో నిర్వహించబడతాయి.
“ప్రజలకు మరింత వేగవంతమైన, సురక్షితమైన, పారదర్శకమైన సేవలు అందించడమే మా లక్ష్యం.”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.