పున్నమి ప్రతినిధి
ఖమ్మం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ సత్తా చాటాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపు నిచ్చారు.
స్థానిక ఖమ్మం జిల్లా బి ఆర్ ఎస్ కార్యాలయం లో జరిగిన ఖమ్మం అసెంబ్లీ కార్యకర్తల సమావేశం లో అయన మాట్లాడుతూ
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు పెట్టాలంటే భయపడుతుందని
ఇచ్చిన అబద్దపు హామీలు నెరవేర్చలేక కాలం గడుపుతూ కేసీఆర్ పై నిందలు వేస్తుంది అని దుయ్య బట్టారు.
ఖమ్మం నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించినవారి లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ,మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు లు ఉన్నారు. వారు మాట్లాడుతూ
రైతులను యూరియా కోసం చిత్ర హింసలు పెడుతున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కేసీఆర్ ని నిందిస్తున్నారు
కాళేశ్వరం కూలిపోయింది అంటూనే కాలేశ్వరం నుండి వచ్చే నీళ్ళకోసం శంకుస్థాపణలు చేస్తున్నారన్నారు
రైతు రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, నిరుద్యోగ భృతి లేదు, నాలుగు వేల పెంక్షన్ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు తులం బంగారం లేదు, ఆడపిల్లలకు స్కూటీలు లేవు ఇవ్వన్నీ చేయకుండా ప్రజలను మభ్య పెడుతున్నారు
ప్రజలు మళ్ళీ కేసీఆర్ సియం చేయడానికి ఎదురు చూస్తున్నారన్నారు


