ఏపీఎం గురుమూర్తి
పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం
రామచంద్రపురం మండలం నందు గురువారం మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో జెండర్ కార్యక్రమాలకు గురించి వివోఏలకు మరియు ఎమ్మెస్ ఈసీమెంబర్లకు, జెండర్ కమిటీలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఎం మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబము కుటుంబ స్థాయి నుంచే ఆడ మగ సమానమనే ఆలోచన ధోరణి రావాలని, మరియు మహిళా చట్టాల గురించి తెలియజేశారు మహిళలు వేధింపులకు గురికాకుండా ఉండేవిధంగా జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు సంఘాలలో జెండర్ పాయింట్ పర్సన్ కి తమ యొక్క యొక్క సమస్యల్ని తెలుపవచ్చు అన్నారు అదేవిధంగా వివో మరియు ms శాక్ కమిటీ లకు మహిళా సమస్యలను తెలుపవచ్చన్నారు మండల సమైక్యలో జెండర్ రిసోర్సె సెంటర్ సేవలను వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక రామచంద్రపురం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భక్తవత్సలం మాట్లాడుతూ సైబర్ క్రైమ్ గురించి పూర్తిస్థాయిలో మహిళలకు అవగాహన కల్పించడం జరిగింది . ఈ కార్యక్రమంలో వివోఏలు మరియు ఎమ్మెస్ ఈసీ మెంబర్లు ఈనారీలు మరియు సీసీలు సుధాకర్, పార్వతమ్మ, అరుణ, ఎమ్మెస్ అకౌంటెంట్ స్వర్ణలత ఎమ్మెస్ అధ్యక్షరాలు మరియు కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.




