సీతారామపురం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం విజయవంతమైన సందర్భంగా ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం లోని వింజమూరు మండలంలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలి నుండి ఎస్వి కన్వెన్షన్ హాల్ వరకు నిర్వహించే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయోత్సవ ర్యాలీ, సభకు సీతారామపురం మండలం నుండి ప్రత్యేక బస్సుల్లో భారీగా మహిళలు తరలి వెళ్లారు. ర్యాలీ కోసం తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న బస్సులను మాజీ జెడ్పిటిసి కలివెల జ్యోతి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు నేలటూరి జాషువా, గాజులపల్లి చంద్ర రెడ్డి, ఇజ్రాయిల్, మండల తెలుగు యువత నాయకుడు పసుపులేటి వికాస్ బాబు (విక్కీ), దేవర వెంకటేశ్వర్లు, కాశిపోగు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


