గాజువాక, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) : భారత రాయబార కార్యాలయం తరఫున ఫస్ట్ సెక్రటరీ ఇన్ఫర్మేషన్, కల్చర్ ఎడ్యుకేషన్, విపుల్ బావా, కౌన్సెలర్ కమ్యూనిటీ వెల్ఫేర్ వై సాబీర్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి, రియాద్ ప్రాంతంలో సౌదీ అరేబియా తెలుగు సంఘం నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. రాయబార కార్యాలయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా ఆన్‌లైన్ ద్వారా ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ ఎన్‌ఆర్‌టీ సొసైటీ ద్వారా సంఘం చేస్తున్న సేవలను కొనియాడారు. ముఖ్యంగా ఎడారిలో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించడం, ఆపదలో ఉన్న మహిళలకు తోడ్పాటు అందించడం, సౌదీలో మరణించిన వారి మృతదేహాలను కుటుంబ సభ్యుల ఆఖరి చూపుల కోసం స్వదేశానికి పంపడం వంటి సేవలను ప్రస్తావిస్తూ భారత రాయబార కార్యాలయం ఆల్ ఇండియా స్టీరింగ్ కమిటీ సభ్యులందరూ హాజరై సంఘం సేవలను కొనియాడారు. కమిటీ చైర్మన్ శ్రీ జైగమ్ ఖాన్ మాట్లాడుతూ, ఈ సంఘం గత నాలుగేళ్లుగా దేశం కానీ దేశంలో చనిపోయిన వారి మృతదేహాలను స్వదేశానికి పంపడంలోనూ, సామాజిక సేవల్లోనూ ఇతర సంఘాలకు మార్గదర్శకంగా నిలిచిందని అభినందించారు.వేడుకకు సౌదీ అరేబియా నలుమూలల నుండి అభా, తాయిఫ్, జిజాన్ వంటి ప్రాంతాల నుండి వైద్యులు, ఇంజినీర్లు పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖోబర్, జుబైల్ పారిశ్రామిక నగరాల నుండి కూడా తెలుగు ప్రజలు విస్తృతంగా విచ్చేశారు. ధమ్మాంలోని తెలుగు సంఘం కుటుంబాల సమేతంగా పాల్గొన్నారు. సభ్యుల నిరంతర కృషి ఫలితంగా 2,000 మందికి పైగా తెలుగు ప్రజలు తెలుగు భాష దినోత్సవానికి హాజరై, సంప్రదాయ దుస్తులలో, తెలుగు వంటకాలతో తెలుగుదనం ఉట్టిపడుతూ చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గోంగూరా, పూతరేకులు, మామిడి చారు, ఆవకాయ, రాజుగారి పులావ్ వంటి రుచికర వంటకాలతో తెలుగు సంప్రదాయ రుచులను అందించారు.వేదిక అలంకరణల నుండి కార్యక్రమ ముగింపు వరకు ప్రతి అంశం అద్భుతంగా సాగింది. చిన్నారుల నృత్యాలు, యువతీయువకుల ఉత్సాహభరిత ప్రదర్శనలు, “భారత వధూవరులు” అనే వివాహ సంప్రదాయాల ప్రదర్శన, “మిస్ తెలుగమ్మాయి” వంటి ప్రత్యేక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.సందర్భంగా మాట్లాడిన వివిధ రాష్ట్రాల ప్రవాసీ భారతీయ ప్రముఖులు, హైదరాబాద్ నగర ప్రవాసీ ప్రముఖులందరు కూడా సాటా సెంట్రల్ తెలుగు భాష అభిమానంతో తోటి తెలుగువారితో పాటు భారతీయులకు అందిస్తున్న ఆపన్న హస్తం గురించి ప్రస్తావిస్తూ ప్రశంసించారు. సాటా సెంట్రల్ నిరంతర సేవానిరతిని కొనియాడారు.సంఘ అధ్యక్షులు ఆనందరాజు, సుచరిత గారు ప్రసంగిస్తూ, తెలుగు భాష దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క మహిళా సభ్యురాలికి ధన్యవాదాలు తెలిపారు.వారి సహకారం లేకపోతే ఈ స్థాయి వైభవం సాధ్యపడేది కాదని స్పష్టం చేశారు. కుల మతాలకు, వాణిజ్య వ్యాపారాలకు అతీతంగా శాత సెంట్రల్ సామాజిక సేవే పరమార్ధంగా ముందుకు సాగుతుందని తెలిపారు.ఈ వేడుకను ఘనవిజయం చేసిన సంఘ ప్రధాన సభ్యులు: ముజ్జమిల్ షేక్, రంజిత్ చిత్తులూరి, యెర్రన్న దుగ్గపు, షేక్ జాని బాషా, చొల్లంగి సత్తి బాబు, యాకూబ్ ఖాన్, పోకూరి ఆనంద్, వెంకటరావు, నాగార్జున, నరేంద్ర, ముసైబ్, వంశీ, వినయ్, షౌకత్, నజీముద్దీన్, గోవింద్, చంద్ర, అక్షిత, భారతి, గీత, మాధవి, లక్ష్మి కాకుమాని, ఉష దుగ్గపు, మానస, శిల్ప, సింధూర, గుండుబొగుల రమ్య, గోదా శ్రీ, గీత శ్రీనివాస్, లక్ష్మి మాధవి, శ్రీదేవి మల్లికార్జున, మాధవి బాలు, అర్చన శ్రీపాద, కవిత కఱ్ఱి, ప్రియాంక, చేతన, పావని శర్మ, రజని, ముబీనా, మానస కనిగిరి, సంధ్య బబ్బూరి తదితరులు తెలుగు వారందరికీ ధన్యవాదాలు తెలియచేసారు.

సౌదీ అరేబియాలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు