అనకాపల్లి జిల్లా, ఫిబ్రవరి 28 (పున్నమి న్యూస్ ప్రతినిధి – ఆనంద్):
ఎస్. రాయవరం మండలం రేవు పోలవరం జడ్.పీ.హెచ్.ఎస్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం హెచ్.ఎమ్. అరుణ గారి ఆధ్వర్యంలో జరిగింది.
సైన్స్ టీచర్లు కుర్మారావు, ప్రవీణ్ కుమార్ మరియు ఇతర ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు వివిధ సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను, శాస్త్రీయ ఆలోచనలను ప్రతిబింబించే ప్రాజెక్టులను రూపొందించి అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా హెచ్.ఎమ్. అరుణ గారు మాట్లాడుతూ C. V. Raman గారి “రామన్ ఎఫెక్ట్” గురించి వివరించి, విద్యార్థులు శాస్త్రీయ వైఖరి మరియు శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలని సూచించారు. శాస్త్ర విజ్ఞానం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.








