Monday, 30 March 2026
  • Home  
  • సైక్లోన్ అప్డేట్ ఆంధ్రప్రదేశ్
- E-పేపర్

సైక్లోన్ అప్డేట్ ఆంధ్రప్రదేశ్

నవంబర్ 29 రాత్రి నుండి డిసెంబర్ 4 వరకు ‘సైక్లోన్ డిట్వా’ ప్రభావం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పూర్తి స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని తిరుపతి మరియు నెల్లూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ​ప్రాంతాల వారీగా వర్షపాత వివరాలు: ​దక్షిణ కోస్తా ఆంధ్రా (తిరుపతి, నెల్లూరు, దక్షిణ ప్రకాశం): ​ఈ ప్రాంతంలో నవంబర్ 30 రాత్రి నుండి డిసెంబర్ 4 రాత్రి వరకు వర్షాలు ఉంటాయి. ఇందులో ప్రధానంగా డిసెంబర్ 1 మరియు డిసెంబర్ 2 ఉదయం వరకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. డిసెంబర్ 3 మరియు 4 తేదీల్లో తుఫాను ప్రభావం వల్ల వర్షాలు కొనసాగుతాయి. మొత్తంగా ఈ ప్రాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి, ముఖ్యంగా తిరుమల ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ​మధ్య ఆంధ్రా (మిగిలిన ప్రకాశం, బాపట్ల, ఎన్టీఆర్, కోనసీమ, కాకినాడ, ఏలూరు, గుంటూరు, పల్నాడు, తూర్పు & పశ్చిమ గోదావరి): ​ఇక్కడ డిసెంబర్ 1 మరియు డిసెంబర్ 2వ తేదీల్లో వర్షాలు ఉంటాయి, డిసెంబర్ 2 నుండి వర్షాలు తగ్గుముఖం పడతాయి. తెలంగాణ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, సముద్ర తీరానికి (బంగాళాఖాతం) దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. విజయవాడ – గుంటూరు – ఏలూరు ప్రాంతాల్లో కచ్చితంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ​ఉత్తరాంధ్ర ప్రాంతం (వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, అనకాపల్లి): ​ఇక్కడ ప్రధానంగా డిసెంబర్ 2న మాత్రమే వర్షాలు ఉంటాయి. అయితే డిసెంబర్ 1న వైజాగ్ – అనకాపల్లి ప్రాంతాల్లో అక్కడక్కడ ముందస్తు జల్లులు పడవచ్చు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ఉండకపోవచ్చు, కానీ మేఘావృతమైన ఆకాశం మరియు చల్లని వాతావరణంతో పాటు అప్పుడప్పుడు జల్లులు లేదా తేలికపాటి వర్షాలు పడతాయి.

నవంబర్ 29 రాత్రి నుండి డిసెంబర్ 4 వరకు ‘సైక్లోన్ డిట్వా’ ప్రభావం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పూర్తి స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని తిరుపతి మరియు నెల్లూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
​ప్రాంతాల వారీగా వర్షపాత వివరాలు:
​దక్షిణ కోస్తా ఆంధ్రా (తిరుపతి, నెల్లూరు, దక్షిణ ప్రకాశం):
​ఈ ప్రాంతంలో నవంబర్ 30 రాత్రి నుండి డిసెంబర్ 4 రాత్రి వరకు వర్షాలు ఉంటాయి. ఇందులో ప్రధానంగా డిసెంబర్ 1 మరియు డిసెంబర్ 2 ఉదయం వరకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. డిసెంబర్ 3 మరియు 4 తేదీల్లో తుఫాను ప్రభావం వల్ల వర్షాలు కొనసాగుతాయి. మొత్తంగా ఈ ప్రాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి, ముఖ్యంగా తిరుమల ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
​మధ్య ఆంధ్రా (మిగిలిన ప్రకాశం, బాపట్ల, ఎన్టీఆర్, కోనసీమ, కాకినాడ, ఏలూరు, గుంటూరు, పల్నాడు, తూర్పు & పశ్చిమ గోదావరి):
​ఇక్కడ డిసెంబర్ 1 మరియు డిసెంబర్ 2వ తేదీల్లో వర్షాలు ఉంటాయి, డిసెంబర్ 2 నుండి వర్షాలు తగ్గుముఖం పడతాయి. తెలంగాణ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, సముద్ర తీరానికి (బంగాళాఖాతం) దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. విజయవాడ – గుంటూరు – ఏలూరు ప్రాంతాల్లో కచ్చితంగా వర్షాలు పడే అవకాశం ఉంది.
​ఉత్తరాంధ్ర ప్రాంతం (వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, అనకాపల్లి):
​ఇక్కడ ప్రధానంగా డిసెంబర్ 2న మాత్రమే వర్షాలు ఉంటాయి. అయితే డిసెంబర్ 1న వైజాగ్ – అనకాపల్లి ప్రాంతాల్లో అక్కడక్కడ ముందస్తు జల్లులు పడవచ్చు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ఉండకపోవచ్చు, కానీ మేఘావృతమైన ఆకాశం మరియు చల్లని వాతావరణంతో పాటు అప్పుడప్పుడు జల్లులు లేదా తేలికపాటి వర్షాలు పడతాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.