నందిగామ మార్కెటింగ్ యార్డు వద్ద సీసీఐ (Cotton Corporation of India) పత్తి కొనుగోలు వెంటనే ప్రారంభించా లని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ యార్డు కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు.
రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పి.వి.ఆంజనేయులు మాట్లాడుతూ, నవంబర్ 7న ఘనంగా ప్రారంభించిన సీసీఐ కొనుగోలు కేంద్రం ఇంకా పత్తి కొనుగోలు ప్రారంభించకపోవడం రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందన్నారు. గ్రామాల్లో వ్యాపారులు తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేస్తున్నారని, రైతులకు నష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల సంఘం నాయకులు చనుమోలు సైదులు మాట్లాడుతూ, సీసీఐ పత్తి కొనుగోలులో మిల్లర్లకు అవకాశ మివ్వడం వల్ల రైతులు నష్ట పోతున్నారని తెలిపారు. గుంటూరుకు వెళ్లి పత్తి అమ్మే పరిస్థితి లేదని, స్థానిక మార్కెట్ యార్డులోనే కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక రైతులు “కాపాస్ కిసాన్ యాప్”లో స్లాట్ బుక్ చేసుకోవాల్సిన నిబంధన తో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, దీన్ని రద్దు చేసి “ఈ-క్రాప్” రిజిస్ట్రేషన్ ఆధారంగా కొనుగోలు జరపాలని కోరారు.
ఈ ఆందోళనలో రైతు సంఘం నాయకులు గడిపూడి వీరప్రసాద్, కమతం పుల్లారావు, సైదల్లి, సయ్యద్ ఖాసిం, అలాగే సీఐటియు నాయకుడు కే. గోపాల్ తదితరులుపాల్గొన్నారు.

సీసీఐ పత్తి కొనుగోలు వెంటనే ప్రారంభించాలి — రైతు సంఘం డిమాండ్
నందిగామ మార్కెటింగ్ యార్డు వద్ద సీసీఐ (Cotton Corporation of India) పత్తి కొనుగోలు వెంటనే ప్రారంభించా లని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ యార్డు కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పి.వి.ఆంజనేయులు మాట్లాడుతూ, నవంబర్ 7న ఘనంగా ప్రారంభించిన సీసీఐ కొనుగోలు కేంద్రం ఇంకా పత్తి కొనుగోలు ప్రారంభించకపోవడం రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందన్నారు. గ్రామాల్లో వ్యాపారులు తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేస్తున్నారని, రైతులకు నష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల సంఘం నాయకులు చనుమోలు సైదులు మాట్లాడుతూ, సీసీఐ పత్తి కొనుగోలులో మిల్లర్లకు అవకాశ మివ్వడం వల్ల రైతులు నష్ట పోతున్నారని తెలిపారు. గుంటూరుకు వెళ్లి పత్తి అమ్మే పరిస్థితి లేదని, స్థానిక మార్కెట్ యార్డులోనే కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక రైతులు “కాపాస్ కిసాన్ యాప్”లో స్లాట్ బుక్ చేసుకోవాల్సిన నిబంధన తో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, దీన్ని రద్దు చేసి “ఈ-క్రాప్” రిజిస్ట్రేషన్ ఆధారంగా కొనుగోలు జరపాలని కోరారు. ఈ ఆందోళనలో రైతు సంఘం నాయకులు గడిపూడి వీరప్రసాద్, కమతం పుల్లారావు, సైదల్లి, సయ్యద్ ఖాసిం, అలాగే సీఐటియు నాయకుడు కే. గోపాల్ తదితరులుపాల్గొన్నారు.

