Tuesday, 24 March 2026
  • Home  
  • సీతారామపురంలో వైసీపీ కోటి సంతకాల సేకరణ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీతారామపురంలో వైసీపీ కోటి సంతకాల సేకరణ

సీతారామపురం అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) ప్రభుత్వ వైద్య విద్య రంగాన్ని కూటమి ప్రభుత్వం పేదలకు దూరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైసిపి ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఆదివారం సీతారామపురం లో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి యూత్ వింగ్ జాయింట్ సెక్రెటరీ పాలగిరి ముద్దుకృష్ణమరాజు నిర్వహించారు. ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల ప్రకారం సీతారామపురం మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి సూచనల మేరకు సీతారామపురం పంచాయతీ పరిధిలోని రాజు గారి వీధి, బీసీ కాలనీ, నారాయణమ్మ పేట ప్రాంతాలలో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను పిపిపి విధానం లోకి రావడం వలన పేద మధ్య తరగతి కుటుంబాలకు కలిగే నష్టాలను వివరిస్తూ కూటమి పాలన పేద ప్రజలను చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేస్తూ సంతకాల సేకరణను పాలగిరి ముద్దుకృష్ణమరాజు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు వైద్య విద్యను దూరం చేసి తమ జేబులు నింపుకోవాలనే కుట్ర కోణంతో కూటమి ప్రభుత్వం పిపిపి విధానాన్ని ప్రవేశపెట్టిందని దీనిని రాష్ట్ర ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఎన్నికల సమయాలలో ప్రైవేటీకరణను వ్యతిరేకిచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పుతూ ప్రైవేటు యాజమాన్యాలకు తొత్తులుగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుసంధానంగా ఉండే ఆసుపత్రులలో ఉచిత వైద్యాన్ని సైతం పేద ప్రజలకు దూరం చేసి పేద ప్రజల ఉసురు పోసుకుంటుందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిపిపి విధానాన్ని కూటమి సానుభూతిపరులే వ్యతిరేకిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన కోటి సంతకాల సేకరణకు మద్దతు తెలుపుతున్నారన్నారు. పార్టీలకతీతంగా పిపిపి విధానాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించి కోటి సంతకాల ఉద్యమంలో భాగస్వాములవాలని ఆయన కోరారు. కూటమి పాలన ఏర్పడిన ఒకటిన్నర సంవత్సరంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కటారి శ్రీనివాసులు, ఏనుగుల రూపేష్, గుండుపల్లి శ్రీను, తిరుపతయ్య, పవన్ కుమార్, నారాయణరాజు, నవీన్, షబ్బీర్, జమీర్ సునీల్, సురేష్, అలీ తదితరులు పాల్గొన్నారు.

సీతారామపురం అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)

ప్రభుత్వ వైద్య విద్య రంగాన్ని కూటమి ప్రభుత్వం పేదలకు దూరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైసిపి ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఆదివారం సీతారామపురం లో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి యూత్ వింగ్ జాయింట్ సెక్రెటరీ పాలగిరి ముద్దుకృష్ణమరాజు నిర్వహించారు. ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల ప్రకారం సీతారామపురం మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి సూచనల మేరకు సీతారామపురం పంచాయతీ పరిధిలోని రాజు గారి వీధి, బీసీ కాలనీ, నారాయణమ్మ పేట ప్రాంతాలలో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను పిపిపి విధానం లోకి రావడం వలన పేద మధ్య తరగతి కుటుంబాలకు కలిగే నష్టాలను వివరిస్తూ కూటమి పాలన పేద ప్రజలను చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేస్తూ సంతకాల సేకరణను పాలగిరి ముద్దుకృష్ణమరాజు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు వైద్య విద్యను దూరం చేసి తమ జేబులు నింపుకోవాలనే కుట్ర కోణంతో కూటమి ప్రభుత్వం పిపిపి విధానాన్ని ప్రవేశపెట్టిందని దీనిని రాష్ట్ర ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఎన్నికల సమయాలలో ప్రైవేటీకరణను వ్యతిరేకిచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పుతూ ప్రైవేటు యాజమాన్యాలకు తొత్తులుగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుసంధానంగా ఉండే ఆసుపత్రులలో ఉచిత వైద్యాన్ని సైతం పేద ప్రజలకు దూరం చేసి పేద ప్రజల ఉసురు పోసుకుంటుందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిపిపి విధానాన్ని కూటమి సానుభూతిపరులే వ్యతిరేకిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన కోటి సంతకాల సేకరణకు మద్దతు తెలుపుతున్నారన్నారు. పార్టీలకతీతంగా పిపిపి విధానాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించి కోటి సంతకాల ఉద్యమంలో భాగస్వాములవాలని ఆయన కోరారు. కూటమి పాలన ఏర్పడిన ఒకటిన్నర సంవత్సరంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కటారి శ్రీనివాసులు, ఏనుగుల రూపేష్, గుండుపల్లి శ్రీను, తిరుపతయ్య, పవన్ కుమార్, నారాయణరాజు, నవీన్, షబ్బీర్, జమీర్ సునీల్, సురేష్, అలీ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.